
-ఐటీ ఉద్యోగుల హంగామా..
-రెండు లక్షల డ్రగ్స్ మద్యం పట్టివేత.
-రూ. 50 లక్షల విలువ చేసే మూడు కార్ల స్వాధీనం.
-ఆరుగురు ఐటీ ఉద్యోగుల అరెస్ట్
-ఫామ్ హౌస్ నిర్వాహగుడి పై కేసు నమోదు.
-ఐటీ ఉద్యోగాలు. లక్షల్లో జీతాలు.
డబ్బుని ఏం చేయాలో తెలియని పరిస్థితి.
క్రైమ్ మిర్రర్, చేవెళ్ల :- బర్త్డే పార్టీ పేరుతో ఒక ఫామ్ హౌస్ ను బుక్ చేసుకుని అందులో డ్రగ్స్ ఖరీదైన మద్యంతో ఎక్సైజ్ శాఖకు పట్టుబడిన ఆరుగురు ఐటి ఉద్యోగులు. అభిజిత్ బెనర్జీ అనే వ్యక్తి తన బర్త్డే సందర్భంగా ఒక ఫామ్ హౌస్ బుక్ చేసుకున్నారు. చేవెళ్ల ప్రాంతంలో సెరీన్ ఆచార్జ్ ఫామ్ హౌస్ ను బుక్ చేసుకున్నారు.డెల్ కంపెనీలో పని చేసే ఆరుగురైటీ ఉద్యోగులు బర్త్డే పేరుతో దావత్ కోసం ఫామ్ హౌస్ కు వచ్చారు.ఖరీదైన మద్యంతో పాటు 0.5 గ్రామ్స్ 50 గ్రామ్స్ ఎల్ ఎస్ డి బ్లాస్ట్, 20.21 గ్రాముల హరీష్, ఐదు ఖరీదైన మద్యం బాటిల్లతో డ్రగ్స్ తీసుకుంటూ మద్యం తాగుతూ ఎంజాయ్ చేస్తున్నారు.
Read also : శ్రీశైలం జలాశయానికి వరద తగ్గుదల – డ్యామ్ గేట్లు మూసివేత
ఈ సమాచారం అందుకున్నటువంటి ఎస్జీఎఫ్ బీ టీం సిఐ బిక్షపతి ఎస్సై బాలరాజు సిబ్బంది కలిసి ఫామ్ హౌస్ పై దాడి చేశారు.
ఈ దాడిలో డ్రగ్స్ను స్వాధీనం చేసుకొని అందరికీ డ్రగ్స్ కిడ్స్ తో పరీక్షలు నిర్వహించగా అందరికీ పాజిటివ్ వచ్చింది.
వీరి వినియోగిస్తున్నటువంటి రూ. 50 లక్షల కు పైగా విలువ ఉండే మూడు కార్లను ఐదు సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నారు. అభిజిత్ బెనర్జీ సింపుల్ ప్రతాప్ గోయల్ జస్వంత్ దినేష్ వ్యక్తులతో పాటు ఫామ్ హౌస్ యజమాని కూడా కేసు నమోదు చేశారు. వీరందరినీ చేవెళ్ల ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించారు.
డ్రగ్స్ పార్టీని ఫామ్ హౌస్ లో విఫలం చేసిన హెచ్డిఎఫ్సి ను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ షాన్వాస్ ఖాసీం అభినందించారు.
Read also : బనకచర్లను వ్యతిరేకిస్తున్నాం – స్పష్టంచేసిన మంత్రి శ్రీధర్‌బాబు