
ఉమ్మడి కర్నూల్ జిల్లా, క్రైమ్ మిర్రర్:- నిరాధార వార్తలను సోషల్ మీడియాలో వ్యాప్తి చేయకుండ పూర్తిస్థాయిలో విచారించి వార్తలు రాయాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ సూచించారు. జిల్లాలోని తెలకపల్లి మండలంలోని రాకొండ కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయానికి చెందిన విద్యార్థినులు గురువారం ఉదయం బోండాలు తిని, అందులో ముగ్గురు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారని సోషల్ మీడియా దిన పత్రికలో వచ్చిన వార్తపై శుక్రవారం నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ స్పందించారు. జిల్లా అధికారులను కేజీబీవీని సందర్శించి సమగ్ర నివేదికను తెప్పించి పరిశీలించారు.
ఈనెల 25వ తేదీ గురువారం ఉదయం సుమారు 6:25 గంటల సమయంలో తొమ్మిదో తరగతి చదువుతున్న భాను అనే బాలికకు అకస్మాత్తుగా తీవ్ర శ్వాసకోశ సమస్య ఏర్పడింది. పరిస్థితి అత్యవసరంగా ఉండటంతో వెంటనే అదే గ్రామానికి చెందిన బాలిక మామగారికి సమాచారం అందించి, తెల్కపల్లి లోని ఓ ప్రైవేట్ క్లినిక్‌కు తరలించారు. అక్కడ వైద్యులు బాలికను పరిశీలించి తగిన చికిత్స అందించడంతో ఆరోగ్య పరిస్థితి కొంత మేర మెరుగుపడింది.
Health: చలికాలంలో పొద్దున్నే దీనిని తాగితే చాలు.. బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు
Read also : Health: చలికాలంలో పొద్దున్నే దీనిని తాగితే చాలు.. బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు
అనంతరం బాలికను ఇంటికి తీసుకువెళ్లినట్లు తెలిపారు.
అయితే అదే రోజు మధ్యాహ్నం తరువాత బాలికకు మళ్లీ అస్వస్థత కనిపించగా, సాయంత్రం నుంచి రాత్రి వరకు పరిస్థితిని గమనించారు. రాత్రి సుమారు 8:30 గంటల సమయంలో మళ్లీ శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది ఏర్పడటంతో వెంటనే జిల్లాలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి ఇది గ్యాస్ట్రిక్‌కు సంబంధించిన సమస్యగా నిర్ధారించి తగిన చికిత్స అందించారు. చికిత్స అనంతరం బాలిక ఆరోగ్య పరిస్థితి పూర్తిగా మెరుగుపడినట్లు నిర్ధారించిన వైద్యులు ఆమెను డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించారు. ప్రస్తుతం ఆ బాలిక ఇంటివద్ద పూర్తిగా ఆరోగ్యంగా ఉండి, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉందని జిల్లా కలెక్టర్ తెలిపారు. బాలికకు అవసరమైన మెరుగైన వైద్య సేవలు అందేలా జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి (డీఎంహెచ్ఓ)ను కలెక్టర్ ఆదేశించారు. ఈ సంఘటనకు సంబంధించి ఎలాంటి అపోహలు లేదా సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని జిల్లా కలెక్టర్ ప్రజలను విజ్ఞప్తి చేశారు. అలాగే విద్యార్థులకు సంబంధించిన వార్తలను మీడియా ప్రతినిధులు పూర్తిగా నిర్ధారించుకున్న తరువాతే ప్రచురించాలని, లేదా ఈ విషయంలో తన దృష్టికి తీసుకురావాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోరారు.
Read also : బంగ్లాదేశ్ లో మైనారిటీలపై జరుగుతున్న దాడులు చాలా దారుణం : విదేశాంగ అధికారి





