
క్రైమ్ మిర్రర్, ఫిట్నెస్ న్యూస్ :- మనిషి ఆరోగ్యంగా ఉండడానికి వ్యాయామం తప్పనిసరి. అయితే ఈ రోజుల్లో కొంతమంది అసలు వ్యాయమమే చేయట్లేదు. మరికొందరు మాత్రం విపరీతంగా వ్యాయామం చేస్తూ ఉన్నారు. అయితే ఇది శరీరానికి అసలు మంచిది కాదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రతిరోజు వాకింగ్ చేయడం, మంచి ఆహారం తీసుకోవడం, సూర్యరశ్మిని ఆస్వాదించడం, ఎక్కువగా నీరు త్రాగడం వంటివి చేయడం వల్ల మనిషి ఆరోగ్యంగా ఉంటారు. ఏదైనా సరే చేసే పనినీ అతిగా చేయడం వల్ల అది మనకే నష్టమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రతిరోజు వ్యాయామం చేయడం మంచిదే. కానీ అతిగా చేయడం ఆరోగ్యానికి ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
Read also : నో షేక్ హాండ్స్.. నో హగ్స్.. టీమిండియాను మెచ్చుకుంటున్న అభిమానులు!
సాధారణంగా ఉదయం రన్నింగ్ చేసేవారు వారానికి 30 నుంచి 50 కిలోమీటర్ల వరకు పరిగెత్తవచ్చు. అలాగే రోజుకు 7000 నుంచి 10000 అడుగుల వరకు నడవడం అనేది కూడా శరీరానికి మంచిది. అలా కాదని ఎక్కువ దూరం పరిగెత్తడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి అని వైద్యులు చెబుతున్నారు. నిపుణులు హెచ్చరించిన దానికన్నా ఎక్కువగా పరిగెత్తడం వల్ల గుండెకు సంబంధించి అలాగే కీళ్ల సమస్యలు కూడా పెరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంది అని వైద్య నిపుణులు అంటున్నారు. వారానికి రెండు నుంచి మూడుసార్లు స్ట్రెంత్ ట్రైనింగ్ సరిపోతుంది అని చెబుతున్నారు. అలా కాదని అతిగా వ్యాయామం, అతిగా విశ్రాంతి తీసుకోవడం, ఎక్కువసేపు పడుకోవడం, ఎక్కువ ఆహారం తీసుకోవడం, ఎక్కువసేపు ఒకే చోట కూర్చోవడం కూడా ఆరోగ్యానికి ప్రమాదకరమని వైద్యులు అంటున్నారు. కాబట్టి మితమైన వ్యాయామం, సరైన విశ్రాంతి, సరేనా ఆహారం వంటివి కావాల్సిన అంతవరకే తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
Read also : విలన్ పాత్రకు మంచు మనోజ్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?