
క్రైమ్ మిర్రర్, మహాదేవ్ పూర్ ప్రతినిధి:-
పెట్రోల్ బంక్ ల్లో నో స్టాక్ బోర్డులు పెట్టొద్దని ఇంధన నిల్వలు అయిపోక ముందే తగినంత ఇంధనం నిల్వ చేసుకోవాలని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటి తాశిల్దార్ మాచన రఘునందన్ స్పష్టం చేశారు. గురువారం ఆయన ఆయన ఒక ప్రకటనలో మాట్లాడుతూ.. హైదరాబాద్ కు 100,150 కిలో మీటర్ల పరిధి వరకు ఆయా పెట్రోల్ బంకుల డిమాండు అనుసారం చమురు సంస్థలు ఎప్పటికప్పుడు అవసరం మేరకు ఇంధనం సరఫరా చేస్తున్నాయని రఘునందన్ తెలిపారు. ఐతే పెట్రోల్ బంక్ నిర్వాహకుల ఉదాసీనత వల్లనో, నిర్లక్ష్యం వల్ల ఒక్కోసారి పెట్రోల్ బంక్ ల్లో ఇంధనం టైం కి చేరక, అందక నో స్టాక్ బోర్డు పెట్టే పరిస్థితి లేకపోలేదని రఘునందన్ అభిప్రాయపడ్డారు. అందుకే పెట్రోల్ బంకు ల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ నో స్టాక్ బోర్డు పెట్టే పరిస్థితి తలెత్తకుండా యాజమాన్యాలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని రఘునందన్ అన్నారు. పలు ప్రాంతాల్లో వడ్ల కొనుగోలు కేంద్రాలు కూడా ప్రారంభం ఐన నేపథ్యం లో లారీలు, ట్రాక్టర్ల కు తగినంత ఇంధనం అవసరం ఉంటుంది కాబట్టి, పెట్రోల్ బంక్ ల్లో ఇంధన నిల్వలు సిద్ధం గా అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉందని రఘునందన్ స్పష్టం చేశారు.
తెలంగాణలో ఆర్టీసీ సమ్మెకు సిద్ధం..!
నీ పెతాపమా.. నా పెతాపమా – సై అంటే సై అంటున్న కాంగ్రెస్, బీజేపీ