
చౌటుప్పల్,క్రైమ్ మిర్రర్:- యాదాద్రి భువనగిరి జిల్లా,చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలోని లక్కారం, చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలోని చెరువులను పరిశీలించి గంగ పూజను నిర్వహించారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.
చౌటుప్పల్ మున్సిపాలిటీ లోని చెరువు నిండినప్పుడు కాలనీలు జలమయం కాకుండా అధికారులు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి మాట్లాడుతూ
చౌటుప్పల్ మున్సిపాలిటీ డెవలప్మెంట్ కు 500 కోట్ల రూపాయలతో ప్రణాళిక రూపూదిద్దబోతుంది. చౌటుప్పల్ చెరువు నుండి ఏలాంటి నష్టం జరగకుండా ముందస్తుగా ప్రణాళికలు వేసి దండు మల్కాపురం, లక్కారం వద్ద వరదనీరును డైవర్ట్ చేయడంతో మున్సిపాలిటీ ప్రజలకు వరద ముప్పు తప్పింది. ఇందులో భాగంగానే పార్టీ మారుతున్నానని సొంత పార్టీ వాళ్లు,బయట పార్టీ వాళ్లు నాపై కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు అని అన్నారు. ఇటువంటి దుష్ప్రచారాలను ప్రజలు ఎవరూ కూడా నమ్మొద్దని అన్నారు. నేను ఏదైనా నిర్ణయం తీసుకున్నట్లయితే స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి మరి ప్రకటిస్తానని తెలిపారు. నేను ప్రస్తుతం సిన్సియారిటీ కలిగిన కాంగ్రెస్ కార్యకర్త , ఎమ్మెల్యేను పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకే పని చేస్తాను. నా ముందు మునుగోడు అభివృద్ది తప్ప, మరో ఆలోచన లేదు.
Read also : కూతురి మరణం.. అంబులెన్స్ మొదలు డెత్ సర్టిఫికేట్ వరకు లంచాలు ఇవ్వలేక తండ్రి ఆవేదన?
Read also : తగ్గిన తుఫాన్ ప్రభావం.. మరి రేపు స్కూళ్లకు సెలవులు ప్రకటిస్తారా?





