
Brazil Tariff – Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నంత పని చేశారు. బ్రిక్స్ దేశాలకు మద్దతు ఇచ్చే దేశాలకు 10 శాతం అదనపు పన్ను విధిస్తానని చెప్పిన ఆయన.. తాజాగా బ్రిక్స్ సమావేశాలకు వేదికైన బ్రెజిల్ మీద ప్రతీకార చర్యలకు దిగారు. బ్రెజిల్ ఉత్పత్తులపై ఏకంగా 50 శాతం ట్యాక్సులు విధిస్తున్నట్లు ప్రకటించారు. ఈ కొత్త టారిఫ్ లు ఆగష్టు 1 నుంచి అమల్లోకి వస్తాయని తేల్చి చెప్పారు. బ్రెజిల్ తో పాటు మరో ఏడు దేశాల పైనా ట్రంప్ సుంకాలను పెంచారు. శ్రీలంక, ఇరాక్, లిబియా, ఆల్జీరియాలపై 30 శాతం, బ్రూనై, మాల్డోవాపై 25 శాతం, పిలీప్పీన్స్ మీద 20 శాతం ట్యాక్సులు పెంచుతున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ట్రూత్ వేదికగా పోస్టు పెట్టారు.
10 నుంచి 50 శాతానికి ట్యాక్స్ పెంపు
ఏప్రిల్ లో ట్రంప్ ప్రభుత్వం బ్రెజిల్‌పై 10 శాతం సుంకం విధించింది. తాజాగా ఈ ట్యాక్స్ ను 50 శాతానికి పెంచారు. అంతకు ముందు ట్రంప్ సౌత్ కొరియా, జాపన్ ఉత్పత్తులపై 25 శాతం ట్యాక్స్ లు విధించారు. తూర్పు ఆసియాలో వాణిజ్య లోటును పూడ్చుకునేందుకు ఈ సుంకాలు కూడా తక్కువేనని ఆయన వెల్లడించారు. అటు మయాన్మార్, లావోస్, దక్షిణాఫ్రికా, కజఖస్థాన్, మలేషియా, ట్యూనీషియా, ఇండోనేషియా, బోస్నియా అండ్ హెర్జగోవినా, బంగ్లాదేశ్, సెర్బియా, కాంబోడియా, థాయ్‌లాండ్ దేశాలకు కూడా ట్రంప్ సుంకాలు పెంచారు. తాజాగా బ్రిక్స్ దేశాలను ట్రంప్ టార్గెట్ చేశారు. అమెరికా కరెన్సీని బలహీన పరిచే చర్యలను ఊహించబోమన్నారు. ఈ దేశాలపై అదనంగా మరో 10 శాతం ట్యాక్స్ విధిస్తామని ట్రంప్ హెచ్చరించారు.
Read Also: భారత్ తో వాణిజ్య ఒప్పందం.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు!