
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారీఫ్‌ల ప్రభావం ప్రపంచ మార్కెట్లపై పడింది. చైనా కూడా దూకుడు పెంచడంతో యూరోప్ నుంచి ఆసియా వరకు స్టాక్ మార్కెట్లు భారీ పతనాన్ని నమోదు చేస్తున్నాయి. ఈ ప్రభావం దేశీయ స్టాక్ మార్కెట్లపైనా దారుణం పడింది. భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీగా పతనమయ్యాయి. రికార్డు స్థాయిలో సెన్సెక్స్ ఏకంగా 3వేల పాయింట్లు పతనంతో మొదలైంది. నిఫ్టీ దాదాపు వెయ్యి పాయింట్లకుపైగా పతనమైంది.
మార్కెట్ ప్రారంభమైన పది సెకెన్లలోనే 19 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాలతో పాటు అక్కడి స్టాక్ మార్కెట్లు రికార్డు స్థాయిలో పతనమయ్యాయి. మరో వైపు ఆసియా మార్కెట్లు సైతం భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. హాంకాంగ్, చైనా మార్కెట్లు దాదాపు 10 శాతం పతనమ్యాయి. ఈ భయాలు దేశీయ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపాయి. ఈ క్రమంలోనే సోమవారం ప్రారంభంలోనే సెన్సెక్స్ 3వేల పాయింట్లుకుపైగా పతనమైంది. నిఫ్టీ వెయ్యి పాయింట్లకుపైగా తగ్గింది. ఇక డాలర్ మారకంతో పోలిస్తే రూపాయి 30 పైసలు తగ్గి 85.74కి చేరింది.