
మర్రిగూడ(క్రైమ్ మిర్రర్):-
మండలంలోని వట్టిపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి, మానవ హక్కుల కమిషన్ లో ఇచ్చిన పిర్యాదు మేరకు డిఎల్పిఓ శంకర్ నాయక్ గ్రామంలో విచారణ మొదలుపెట్టారు.. అక్రమంగా నిర్మాణం చేసిన ఇంటికి, గ్రామపంచాయతీ మౌలిక సదుపాయాలు ఎలా కల్పిస్తారని, ఇంటి ట్యాక్స్ ఎలా వసూలు చేస్తారని ఇచ్చిన పిర్యాదు అధికారుల దృష్టికి వెళ్లడంతో, ఉన్నత అధికారుల ఉత్తర్వుల మేరకు గ్రామపంచాయతీ సెక్రటరీ రూమ్ లో రహస్య విచారణ మొదలు పెట్టారు.. ఉదయం 10 గంటల నుండి ఎంపీవో రవి కుమార్, గ్రామపంచాయతీ సెక్రటరీ, వంశీ కృష్ణ సమక్షంలో ఇరుపక్షాల వాదనలు వింటూ, కాగితాలు ఏమి సమాధానం చెబుతున్నాయో పరిశీలించే ప్రయత్నం చేశారు.. తండ్రి కొడుకుల మధ్య చిక్కిన ఇంటి పంచాయతీని, డిఎల్పీవో చెక్ పెట్టనున్నారా… లేక సూసాయగా వచ్చారా అనేది తెలియాల్సి ఉంది.. అక్రమంగా చేపట్టిన ఇంటి నిర్మాణాన్ని తక్షణమే కూల్చాలన్న శ్రీనివాస్ పిర్యాదుపై డిఎల్పిఓ ఇచ్చే తుది నివేదిక ఏంటనేది ప్రశ్నగా మిగిలింది.. శంకర్ నాయక్ నిజానిజాల నివేదిక ప్రకారమే సమస్య తొలగిపోతుందని గ్రామస్థుల చర్చ.. వట్టిపల్లి గ్రామపంచాయతీ సెక్రటరీ ఇచ్చిన ధ్రువీకరణల ప్రకారమే నిజాలు బయట పడే అవకాశం ఉంది.
<a href=”https://crimemirror.com/prajavani-closed-down-the-root-cause-is-the-negligence-of-the-rulers/”>మూసేసిన ‘ప్రజావాణి’ – మూలదోషం పాలకుల నిర్లక్ష్యమే!