
ఇష్టానురీతిగా హెచ్‌సీయూ భూములు అమ్ముతానంటే ఊరకోబోమని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు.
హెచ్‌సీయూ భూముల వేలంపై రేవంత్ సర్కార్ కు ఆమె సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఎంపీ డీకే అరుణ ఆధ్వర్యంలో ఢిల్లీ తెలంగాణ భవన్ ముందు టీ.బీజేపీ ప్రజాప్రతినిధులు ధర్నా చేశారు.సేవ్ హెచ్‌సీయూ పేరుతో ప్లకార్డులు ప్రదర్శించారు. సిగ్గు సిగ్గు రేవంత్ ప్రభుత్వం తీరు అంటూ నినాదాలు చేశారు. హైదరాబాద్ యూనివర్సిటీ భూముల అమ్మకాన్ని ఆపాలని నినాదాలు చేశారు.
రేవంత్ సర్కారు పాలనలో ఘోరంగా విఫలమైందని డీకే అరుణ మండిపడ్డారు. ఇచ్చిన హామీలు అమలు చేయడం చేతకాగా, ప్రభుత్వ భూములు అమ్ముతారా అని నిలదీశారు. గతంలో బీఆరెస్ ప్రభుత్వం కోకాపేటలో ప్రభుత్వ భూములు అమ్ముతుంటే వ్యతిరేకించిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు అదే బాటలో నడుస్తున్నారని మండిపడ్డారు. ఉన్నత విద్య అంటివి.. విద్యార్థుల భవిష్యత్తే ముఖ్యమంటివి.. ఇప్పుడేమో విద్యాసంస్థలకు కేటాయించిన భూములు బలవంతంగా అమ్మేందుకు ప్రయత్నిస్తున్నావ్ అంటూ సెటైర్లు వేశారు అరుణమ్మ. ప్రభుత్వ ఆస్తుల పేరుతో భూములు అమ్మాలని మిమ్మల్ని ప్రజలు గెలిపించారా..ప్రజలకు మేలు చేయాలన్న సంకల్పమే ఉంటే మీ సొంత ఆస్తులు అమ్ముకోండని తేల్చి చెప్పారు.
అధికారాన్ని అడ్డంపెట్టుకుని నిర్భంధంగా ప్రభుత్వ ఆస్తులు అమ్ముతానంటూ బీజేపీ చూస్తూ ఊరుకోదన డీకే అరుణ హెచ్చరించారు. ప్రతిపక్ష పార్టీగా హెచ్‌సీయూ విద్యార్థులకు, తెలంగాణ ప్రజలకు మద్దతుగా ఉంటామన్నారు. ప్రభుత్వం ఈ నిర్ణయం వెనక్కు తీసుకునే వరకు పోరాటం చేస్తామని తెలిపారు. కాదు కూడదు అని విద్యార్థుల ధర్నాలు పోలీసు నిర్భంధంతో అణిచివేస్తామంటూ ఊరుకునేది లేదని చెప్పారు. మిస్టర్ రేవంత్ రెడ్డి ఖబర్దార్… నీ జాగీరు గారు ప్రభుత్వ భూములు.. అవి ప్రజల ఆస్తులు.. మీ ఇష్టానుసారంగా అమ్ముతానంటే ఎవరూ చూస్తూ ఊరుకోరు..హెచ్‌సీయూ భూముల వేలం ఆపే వరకు పోరాటం ఆపేది లేదని డీకే అరుణ స్పష్టం చేశారు.