
-
88వ గ్రాండ్ మాస్టర్‌గా దివ్య దేశ్‌ముఖ్
-
ఫైనల్ టై బ్రేకర్‌లో కోనేరు హంపి ఓటమి
-
75వ ఎత్తులో ఓటమిని అంగీకరించిన హంపి
క్రైమ్‌మిర్రర్, హైదరాబాద్: ఫిడే మహిళల చెస్ వరల్డ్‌కప్ విజేతగా దివ్య దేశ్ ముఖ్ నిలిచారు. ఫైనల్‌లో టైబ్రేకర్‌లో కోనేరు హంపిని దివ్య దేశ్‌ముఖ్ ఓడించారు. ఫిడే వరల్డ్ కప్ టైటిల్ గెలిచిన తొలి భారతీయురాలిగా 19ఏళ్ల దివ్య రికార్డ్ సృష్టించింది.
జార్జియాలో జరిగిన ఫిడే చాంపియన్ షిప్ ఫైనల్‌లో తొలి రెండు గేమ్‌లు డ్రాగా ముగిశాయి. విజేతను నిర్ణయించేందుకు టై బ్రేకర్ నిర్వహించారు. ఈ పోరులో కోనేరు హంపిపై దివ్య గెలుపొందింది. 75వ ఎత్తులో హంపి తన ఓటమిని అంగీకరించింది. దీంతో ఇప్పటివరకు ఇంటర్నేషనల్ మాస్టర్‌గా ఉన్న దివ్య… ఈ విజయంతో గ్రాండ్ మాస్టర్ హోదా పొందింది.
Read Also: