Thursday, March 19, 2026
Homeసినిమానా సినిమాలకు టికెట్ ధరలు పెంచను.. దిల్ రాజు సంచలన ప్రకటన

నా సినిమాలకు టికెట్ ధరలు పెంచను.. దిల్ రాజు సంచలన ప్రకటన

తమ్ముడు మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో నిర్మాత దిల్ రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇకపై తెలంగాణలో టికెట్ ధరలు పెంచడం ఉండదని చెప్పారు. తెలుగు సినీ పరిశ్రమలో మార్పు రావాలన్నారు దిల్ రాజు. తన సినిమాలకు టికెట్ ధరలు పెంచనని తేల్చి చెప్పారు. త్వరలో విడుదల కాబోతున్న తమ్ముడు చిత్రానికి ధరలు పెంచమని తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలను అడగబోనని దిల్ రాజు స్పష్టం చేశారు.

ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంపై పవన్ కల్యాణ్ కీలక సూచనలు చేశారని దిల్ రాజు చెప్పారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తనకు ఆదర్శమన్నారు. పవన్ కల్యాణ్ సూచనలను అనుసరిస్తా.. పవన్ కల్యాణ్ సూచనలను నిర్మాతలంతా తప్పకుండా పాటించాలని సూచించారు. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం నిర్మాతల బాధ్యత.. టికెట్ ధరలు, తినుబండారాలు ప్రేక్షకులకు అందుబాటులో ఉండాలని దిల్ రాజు తెలిపారు.

తెలంగాణ మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలోనూ చర్చించాం.. పవన్ కల్యాణ్ సూచనలపై తెలంగాణ ప్రభుత్వానికి ప్రతిపాదనలు ఇచ్చానని దిల్ రాజు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments