
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- తెలంగాణ రాష్ట్రంలోని నారాయణపేట జిల్లా మద్దూర్ పట్టణ కేంద్రంలో భునీడు రోడ్డుకు వెళ్లే రహదారిలో నాగిరెడ్డి కుంట చెరువు కట్ట ఇరువైపులా చనిపోయిన కోళ్లను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు పడేసి వెళ్లిపోయారు. దీంతో అటుగా చెరువు కట్టపై వెళ్లేటువంటి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ నుంచి ఇప్పటికే ప్రజలు చికెన్ తినాలంటే భయం గుప్పెట్లో పెట్టుకొని తింటున్నారు. వ్యవసాయ పొలాలలో కోళ్లను ఇలా పడేస్తే ఎలా అని వ్యవసాయ పొలాల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత శాఖ అధికారులు స్పందించి ఈ కోళ్లను ఎవరు పడేశారు అని దానిని నిర్ధారించాలని మండల ప్రజలు కోరుతున్నారు.
ఫ్రీ కరెంట్ స్కీం బంద్? వినియోగదారుల్లో టెన్షన్
ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలలో బర్డ్ ఫ్లూ కారణంగా కొన్ని లక్షల్లో కోళ్లు అనేవి మరణించాయి. అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా ఇప్పటికీ చికెన్ తినండి అని ఎంతోమంది అధికారులు ప్రజలకు విన్నపిస్తున్న సరే ప్రజలు తినడానికి మాత్రం ముందుకు రావడం లేదు. ఇలాంటి సమయంలో ఇలాంటి సంఘటనలు మరిన్ని జరుగుతుంటే ప్రజలు భయపడక ఇంకేమవుతారు. చనిపోయిన కోళ్లను వాటికి సంబంధించి ఎక్కడో ఒకచోట పూర్తి పెట్టాలి కానీ ఇలా చెరువులు పక్కన లేదా పొలాల పక్కన వేస్తే ఎలా అని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. త్వరగా అధికారులు దీనిపై స్పందించి వెంటనే ఆ దుండగులను పట్టుకోవాలని విన్నపించారు.