Saturday, March 21, 2026
HomeజాతీయంBengal Elections: బెంగాల్లో దీదీ వర్సెస్ మోడీ.. గెలుపు వారిదే?!

Bengal Elections: బెంగాల్లో దీదీ వర్సెస్ మోడీ.. గెలుపు వారిదే?!

* అంతు పట్టని పశ్చిమ బెంగాల్ రాజకీయం

* సర్వశక్తులు ఒడ్డుతున్న బిజెపి 

* అంతిమ విజయం మాత్రం ఆమెదే?!

క్రైమ్ మిర్రర్, పశ్చిమ బెంగాల్: దేశ రాజకీయాల్లో ఈ వేసవి కీలకం. దేశంలో కీలకమైన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దేశ రాజకీయాలని ఎన్నికలు శాసిస్తాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. భారతీయ జనతా పార్టీ హవాకు.. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూటమి ఉనికికి మధ్య జరుగుతున్న యుద్ధం ఇది. బిజెపి అప్రతిహస విజయం కొనసాగించినా.. ఇండియా కూటమి ఆధిపత్యం ప్రదర్శించినా.. దేశ రాజకీయాల్లో సమూల మార్పులు రావడం ఖాయం. అయితే ఈ ఐదు రాష్ట్రాల్లో కేవలం అస్సాంలో మాత్రమే భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. మిగతా నాలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆ పార్టీ పాత్ర అపరిమితం. పశ్చిమ బెంగాల్ విషయంలో మాత్రం భారతీయ జనతా పార్టీ ఆశలు పెట్టుకుంది. అయితే అక్కడ మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీని తక్కువగా అంచనా వేయకూడదు.

వామపక్ష భావజాలం ఎక్కువ..

పశ్చిమ బెంగాల్లో వామపక్ష భావజాలాన్ని ఎదుర్కొని నిలబడగలిగారు మమతా బెనర్జీ. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటపడిన ఓ మహిళ నేత తన కొంటూ ఒక ముద్ర చాటుకుని.. దశాబ్దాలుగా వామపక్ష భావజాలాన్ని అలవర్చుకున్న పశ్చిమ బెంగాల్ ప్రజల్లో ఒక చైతన్యం నింపుకొని.. అధికారంలోకి రాగలిగారు మమతా బెనర్జీ. కానీ అదే బలాన్ని చైతన్యవంతమైన రాష్ట్రంగా ఉన్న బెంగాల్లో మూడుసార్లు నిలబెట్టుకోగలిగారు మమతా బెనర్జీ. కానీ ఈసారి ఆ మహిళా నేతను బలంగా ఢీ కొట్టాలని భావిస్తోంది భారతీయ జనతా పార్టీ. కానీ అది అంత సులువు కాదు అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఆ సర్వే ఫలితాలు కూడా అలానే ఉన్నాయి. పశ్చిమ బెంగాల్లో బలమైన పార్టీగా టీఎంసీ నిలుస్తుందని అనేక సర్వేలు ఇప్పుడు తేల్చి చెబుతున్నాయి. మమతా బెనర్జీకి సమతూగే నేత బెంగాల్లో లేరని సర్వే నివేదికలు చెబుతున్నాయి.

బలమైన రాష్ట్రం..

వామపక్ష భావజాలం అంటే ముందుగా గుర్తొచ్చే రాష్ట్రం పశ్చిమ బెంగాల్. జ్యోతి బసు లాంటి బలమైన నేతలు ప్రాతినిధ్యం వహించిన రాష్ట్రం అది. దేశంలో ఎన్ని రాజకీయ పార్టీలు వచ్చినా బెంగాల్ వైపు మాత్రం తొంగి చూసే పరిస్థితి ఉండేది కాదు. అటువంటి సమయంలోనే ఒక మహిళా నేత రంగంలోకి దిగారు. కాంగ్రెస్ పార్టీని విభేదించి తాను ఒక సొంతంగా పార్టీని ఏర్పాటు చేశారు. అలా బెంగాల్లో ప్రవేశించిన ఆ మహిళా టైగర్ పేరే మమతా బెనర్జీ. 2010లో తొలిసారిగా అధికారంలోకి వచ్చిన ఆమె 2026 వరకు నిర్విరామంగా బెంగాల్ కు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. కాంగ్రెస్ పార్టీని విభేదించిన ఆమె అదే పార్టీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వంలో కీలకమైన మంత్రిత్వ శాఖను నిర్వర్తించారంటే ఆమె నిబద్ధత, ఆపై ఆమె చరిష్మ అర్థం అవుతుంది. అయితే ఇప్పుడు ఆమెను ఢీ కొట్టి.. ఆమె నుంచి పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని లాక్కోవాలని చూస్తున్నారు నరేంద్ర మోడీ. కానీ అది అంత సులువు కాదు. అది ఏ ఒక్కరూ మాట్లాడుతుంది కాదు. పశ్చిమ బెంగాల్లో పరిస్థితిని.. ఓటర్ల నాడిని పసిగడుతున్న సర్వే సంస్థలు చెబుతున్న మాటలు ఇవి. మరోసారి దీదీ వర్సెస్ మోడీ అన్నట్టు పశ్చిమ బెంగాల్లో పరిస్థితి ఉంటుందని తేల్చుతున్నాయి సర్వే సంస్థలు. కానీ అంతిమంగా దీదీ వైపే మొగ్గు చూపుతున్నాయి. కానీ ఏం జరుగుతుంది అనేది చూడాలి.

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్‌, వెలుగు దినపత్రిక, V6 చానెల్ లో జర్నలిస్టుగా పని చేశాను.2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశాను. BIG TVకి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, ఆటో, క్రైమ్ వార్తలు అందించాను.ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments