ఆంధ్ర ప్రదేశ్రాజకీయం

రెండు తెలుగు రాష్ట్రాల్లో ది రిచెస్ట్ పార్టీ ఏదో మీకు తెలుసా?.. సర్వేలో సంచలన విషయాలు!

క్రైమ్ మిర్రర్, పొలిటికల్ బ్యూరో:- ప్రపంచంలోనే భారతదేశానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. భారతదేశంలో అనేక రాజకీయ పార్టీలు నిలదొక్కుకొని ఉన్నాయి. ఆయా రాష్ట్రాల ముఖచిత్రాలను ఈ పార్టీలే నిరంతరం మారుస్తూ ఉంటాయి. అయితే ప్రస్తుతం ప్రతి ఒక్కరు కూడా మన భారతదేశంలోని ఏ పార్టీ అత్యధిక ధనవంతమైనదో చర్చిస్తూ ఉన్నారు. అందులోనూ మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ పార్టీ అత్యంత ధనిక సంపన్నమైనటువంటి దో తెలుసుకోవాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా ఒక సర్వే ప్రకారం దేశంలోనూ అలాగే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ పార్టీ అత్యధిక ధనవంతమైన పార్టీయో తెలిసిపోయింది. ఎన్నో ఏళ్లుగా నడుపుకొస్తున్న పార్టీలకు ఎంతోమంది నుంచి విరాళాలు అనేవి వస్తూనే ఉంటాయి. ఇక 2008 నుంచి 2024 వరకు భారత రాజకీయాల్లో నిధుల ప్రవాహం అనేది ఎలా ఉందో స్పష్టంగా తెలిసిపోయింది.

ప్రస్తుతం మన భారతదేశంలో అత్యంత ధనిక రాజకీయ పార్టీగా భారతీయ జనతా పార్టీ మొదటి స్థానంలో నిలిచింది. ఏకంగా 10 సంవత్సరాలకు పైగా కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపికి 2008 నుంచి ఇప్పటివరకు అక్షరాల 8251 కోట్ల విరాళాలు అందాయని ఈ సర్వే తేల్చి చెప్పింది. ఈ స్థాయిలో ఏ పార్టీకి కూడా ఇప్పటివరకు అంతగా నిధులు రాలేదని చెప్పుకోవాలి. ఇక మన రెండు తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలుగు రాష్ట్రాల్లో కూడా.. ప్రాంతీయ పార్టీలని చాలానే ఉన్నాయి. ముఖ్యంగా వైయస్సార్సీపి, తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీలు ఈ మూడు కూడా ఎప్పుడు వినిపిస్తూనే ఉంటాయి. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతిపెద్ద పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక విరాళాలు పొందిన వాటిలో మొదటి స్థానంలో నిలిచింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి 503 కోట్లు విరాళాల రూపంలో అందాయి. ఇక రెండో స్థానంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ 320 కోట్లు విరాళాల రూపంలో అందాయ్. ఇక తెలంగాణ రాష్ట్రంలోని బిఆర్ఎస్ పార్టీకి ఇప్పటివరకు 383 కోట్లు విరాళాలు అందాయి.

చైతన్యంతో ప్రజల మద్దతు పొందుతున్న బాబు నాయక్

పాములపహాడ్ కాంగ్రెస్ పార్టీ నూతన గ్రామ కమిటీ ఎన్నిక

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button