
టాలీవుడ్ లో పుష్ప సినిమాతో బాహుబలి రికార్డులను బద్దలు కొట్టిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒకప్పుడు సినిమా ఆఫర్లు సంపాదించడం కోసం బాగానే కష్టపడ్డాడని చెప్పవచ్చు. అంతేకాదు సినిమా ఇండస్ట్రీలోనే స్టార్ ప్రొడ్యూసర్ కొడుకు అయినప్పటికీ కొన్ని సినిమా ఆఫర్లు చేతి వరకు వచ్చి ఆగిపోయాయి. ఈ విషయంపై టాలీవుడ్ ప్రముఖ సినీ రైటర్ చిన్ని కృష్ణ అల్లు అర్జున్ గురించి రీసెంట్గా జరిగిన ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
ఇందులో అల్లు అర్జున్ మొదటగా జయం అనే సినిమాతో హీరోగా లాంచ్ కావాల్సి ఉందని తెలిపారు. ఈ క్రమంలో డైరెక్టర్ తేజ కూడా అల్లు అర్జున్ కి కథ వినిపించడం ప్రొడ్యూసర్స్ ఓకే చెప్పడం అంతా అయిపోయిందట. కానీ సడన్గా అల్లు అర్జున్ ని జయం సినిమా నుంచి తప్పించి నితిన్ ని తీసుకోవడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారని అంతేకాకుండా అల్లు అర్జున్ కూడా చాలా అప్సెట్ అయిపోయాడని చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత అల్లు అర్జున్ గంగోత్రి సినిమాపై దృష్టి సారించి మంచి హిట్టు కొట్టాడని తెలిపాడు. అల్లు అర్జున్ మంచి యాక్టర్ అయినప్పటికీ అతడి ప్రతిభ బయటపడిన తర్వాతే ఆఫర్లు రావటం మొదలైందని కాబట్టి ఎవరైనా కూడా టాలెంట్ నిరూపించుకుంటేనే ఇండస్ట్రీలో లైఫ్ ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశాడు.
Read More : రాజా సాబ్ సినిమా నుంచి మరో కీలక అప్డేట్.. పార్ట్-2 కూడా ఉంది!
అయితే 2002లో రిలీజ్ అయిన జయం సినిమా ఇటు మ్యూజికల్ గా మరియు కమర్షియల్ గా మంచి హిట్ అయింది. ఈ సినిమాలో బ్యూటిఫుల్ హీరోయిన్ సదా హీరోయిన్గా నటించగా మ్యాచో స్టార్ స్టార్ గోపీచంద్ విలన్ గా నటించాడు. అయితే ఈ సినిమాను రెండు కోట్ల రూపాయల బడ్జెట్తో ఎక్కించుగా దాదాపుగా 11 కోట్లపైగా కలెక్ట్ చేసి దర్శక నిర్మాతలకి లాభాల పంట పండించింది. అయితే అల్లు అర్జున్ హీరోగా నటించిన గంగోత్రి సినిమా 2003లో రిలీజ్ కాగా ఈ సినిమా కూడా రూ.12 కోట్లు పైగా కలెక్ట్ చేసింది.
ఈ విషయం ఇలా ఉండగా గత ఏడాది చివర్లో రిలీజ్ అయిన పుష్ప2: ది రూల్ ఇండస్ట్రీ హిట్ కావడంతో ప్రస్తుతం అల్లు అర్జున్ పాన్ ఇండియా సినిమాలపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో టాలీవుడ్ లో మాత్రమే కాకుండా హిందీ, తమిళ్ డైరెక్టర్స్ తో కూడా సినిమాలు ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం తమిళ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కుమార్ డైరెక్ట్ చేస్తున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో అల్లు అర్జున్ కి జోడిగా దీపిక పదుకొనే నటిస్తోంది. మరోవైపు అట్లీ కుమార్ కూడా గతంలో జవాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హీట్ అందుకున్నాడు. దీంతో మరోసారి అల్లు అర్జున్ అట్లీ కుమార్ కాంబినేషన్తో సెన్సేషనల్ హిట్ కోసం బాగానే శ్రమిస్తున్నాడు.
Also Read : వసూళ్లలో దూసుకుపోతున్న ‘మహావుతార్ నరసింహ’
ఇక హిందీలో బాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీతో కూడా సినిమా చేస్తున్నట్లు కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. ఆమధ్య అల్లు అర్జున్ ముంబైలో ఉన్న సంజయ్ లీలా భన్సాలీ ఆఫీస్ కి వెళ్ళాడు. దీంతో ఈ వార్తలు మరింత ఉపందుకున్నాయి. కానీ అల్లు అర్జున్ మాత్రం హిందీలో స్ట్రైట్ సినిమా చేస్తున్నట్లు వినిపిస్తున్న వార్తలపై ఇప్పటివరకు స్పందించలేదు.