తెలంగాణ

భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు జరగాలి :ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి

క్రైమ్ మిర్రర్, చండూరు:-పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు ఉండాలని అన్నారు మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి. మునుగోడు నియోజకవర్గంలోని చండూరు చౌటుప్పల్ మున్సిపాలిటీల లలో మౌలిక సదుపాయాల కల్పన, జరుగుతున్న అభివృద్ధి పనుల తీరుపై హైదరాబాదులో రెండు మున్సిపాలిటీల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వేసవి దృష్ట్యా తాగునీటి సమస్యలు రాకుండా చూసుకోవాలని అధికారులకు సూచించారు. ఇప్పటివరకు కొత్తగా నిర్మించిన ట్యాంకులు, పైపులైన్లు వాటి కనెక్టివిటీ, త్రాగునీటి వనరుల లభ్యత పై కులంకశంగా చర్చించారు.

రాష్ట్రపతి భవన్ లో చండూరు చేనేత కళాకారుల ప్రతిభా ప్రదర్శన!..

2035 వరకు చౌటుప్పల్ మున్సిపాలిటీ జనాభా రెండు లక్షలకు పైగా పెరుగుతుందని పెరుగుతున్న జనాభాను దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి పనులు జరగాలన్నారు… చౌటుప్పల్ పట్టణంలోని రోడ్లన్నీ వెడల్పు చేయాలని 100 ఫీట్ల వెడల్పు, 80 ఫీట్ల వెడల్పు, 50 ఫీట్ల వెడల్పులలో రోడ్లు ఉండేలా ప్రణాళికలు జరగాలన్నారు… చిన్న కొండూరు రోడ్డు ను 80 ఫీట్ల వెడల్పు, తంగడపల్లి వలిగొండ రోడ్లను 100 ఫీట్ల వెడల్పుతో అభివృద్ధి చేసుకోవాలన్నారు… సర్వీస్ రోడ్ల వెడల్పు శాస్త్రీయంగా జరగలన్నారు.. చౌటుప్పల్ పట్టణంలోని ఊర చెరువు అలుగు ద్వారా వచ్చే నీటిని సర్వీస్ రోడ్ కింది నుండి బయటకు వెళ్లేలా ప్రణాళిక లు రూపొందించాలన్నారు..

మహేశ్వరానికి ప్రపంచ స్థాయి పరిశ్రమలు :- కే ఎల్ ఆర్

రెండు మున్సిపాలిటీలలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఒకే చోట ఉండేలా ఇంటిగ్రేటెడ్ ఆఫీసెస్ భవనాలను నిర్మించుకోవడానికి కావలసిన స్థలాలను గుర్తించాలన్నారు. చండూర్ మున్సిపాలిటీలో జరుగుతున్న డ్రైనేజీ పనులు, తాగునీటి పైపులైన్ల పనుల అభివృద్ధి పై ఆరా తీశారు.. ప్రతి పట్టణంలో డ్రైనేజ్ చివర తప్పనిసరి గా ట్రీట్మెంట్ ప్లాంట్(ఎస్ డి పి) నిర్మించేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు. అభివృద్ధి పనుల ప్రణాళికలు మీరు రూపొందించండి.. వాటికి కావలసిన నిధుల సమీకరణ నేను చూసుకుంటానని అధికారులకు తెలిపారు. ఈ సమీక్ష సమావేశంలో చౌటుప్పల్ చండూరు మున్సిపాలిటీల అధికారులు పాల్గొన్నారు.

నాగబాబుకు ఎమ్మెల్సీ – రూటు మార్చిన పవన్‌ కళ్యాణ్‌..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button