
• దళారుల చేతుల్లోకి సంక్షేమ పథకాలు వెళ్లొద్దు
• ప్రతి పేదవారికి ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలి
• ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
• మునుగోడులో 1828 నూతన రేషన్ కార్డులు పంపిణీ
• లబ్ధిదారులకు రేషన్ కార్డులు అందజేసిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ
• లబ్ధిదారులకు చిన్నచిన్న కారణాలతో ఇందిరమ్మ ఇళ్లు రాలేదు
మునుగోడు (క్రైమ్ మిర్రర్ ప్రతినిధి) : నిజమయిన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు రేషన్ కార్డులు ఇవ్వాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు..మునుగోడు మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మునుగోడు మండలానికి చెందిన 1828 మంది లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులను ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం తో కలిసి శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అందజేశారు..శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ…పేదలకు అండగా ఉండడానికి ప్రతిక్షణం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు..ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలుచేయడానికి నిబద్ధతతో పనిచేస్తుందని,నిబంధనల కారణంగా,చిన్న చిన్న కారణాలతో నిజమయిన అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు రాలేదు,వాటిని సడలించి నిజమయిన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందించే బాధ్యత మనందరిపై ఉందన్నారు.సంక్షేమ పథకాలు నిజమయిన లబ్ధిదారులకు వెళ్ళాలని దళారుల చేతుల్లోకి వెళ్లొద్దు అని సూచించారు.నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయంలో కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇళ్లు రేషన్ కార్డులు వచ్చాయని,నేడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే ఇందిరమ్మ ఇళ్లు రేషన్ కార్డులు వస్తున్నాయని గుర్తుకు తెచ్చారు.పదేళ్లలో ఒక్క రేషన్ కార్డు రాలేదని,కేవలం ఉప ఎన్నికలు వచ్చినప్పుడే సంక్షేమ పథకాలు అందించారన్నారు..ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ..రేషన్ కార్డు అనేది పేదవాళ్లకు చాలా ముఖ్యమైనది.సంక్షేమ పథకాలు నిష్పక్షపాతంగా లబ్ధిదారులకు అందేలా చూడాలని అభిప్రాయంతో శాసనసభ్యులు రాజగోపాల్ రెడ్డి ఉన్నారని కులాల కచ్చితంగా పార్టీలకతీతంగా లబ్ధిదారులకు అందేలా చూడాలని అధికారులకు సూచించారు..ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి ఎమ్మెల్యే చేస్తున్న ప్రయత్నం సంతోషకరమన్నారు. డిసిసిబి చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి,మార్కెట్ కమిటీ చైర్మన్ దటి నారాయణ,వివిధ శాఖల అధికారులు,మాజీ ప్రజాప్రతినిధులు,లబ్ధిదారులు పాల్గొన్నారు.
సొంత గూటికి చేరిన మర్రిగూడ ఎంపీపీ గండికోట రాజమణిహరికృష్ణ..
నిర్మాణంలో ఉన్న రాళ్లవాగు వంతెన.. ఉదృత వలన కొట్టుకుపోయిన తాత్కాలిక దారి