తెలంగాణ

సంక్షేమ పథకాలకు అర్హులను మాత్రమే ఎంపిక చేయాలి: బట్టి విక్రమార్క

సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపిక పూర్తిగా పారదర్శకంగా ఉండాలని, అనర్హులను ఎంపిక చేస్తే అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క హెచ్చరించారు. గ్రామసభల్లోనే లబ్ధిదారులను ఎంపిక చేయాలని, ఇందులో ఇందిరమ్మ కమిటీలను భాగస్వామ్యం కల్పించాలని ఆదేశించారు. లబ్ధిదారుల జాబితాను గ్రామసభల్లోనే ప్రకటించాలన్నారు.

పెట్టుబడులు అంటేనే తెలంగాణ : సీఎం రేవంత్ రెడ్డి

ఎంపిక చేసిన లబ్ధిదారుల జాబితాను జిల్లా మంత్రితో ఆమోదింపజేసుకొని, మంజూరు కోసం ప్రభుత్వానికి నివేదించాలన్నారు. ప్రభుత్వ పథకాలు పొందిన లబ్ధిదారుల వివరాలతో గ్రామాల్లో ఫ్లెక్సిలు ఏర్పాటు చేయాలని సూచించారు. సోమవారం మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఖమ్మం జిల్లా కలెక్టర్‌ ముజమ్మిల్‌ ఖాన్‌, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్‌ జితీశ్‌ పాటిల్‌లతో కలిసి భట్టి విక్రమార్క.. రాష్ట్రంలో కొత్తగా ప్రారంభించబోయే సంక్షేమ పథకాలపై సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధి హామీ జాబ్‌కార్డ్‌ ఉండి, భూమి లేని వ్యవసాయ కుటుంబాలు ఏడాదిలో 20రోజులు ఉపాధి హామీ పని చేసి ఉంటే.. వారికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఏటా రూ.12వేలు అందజేస్తామన్నారు. జనవరి 26 నుంచి కొత్తరేషన్‌ కార్డులను అందజేస్తామని, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను ప్రారంభిస్తామని తెలిపారు. ఈ పథకాలకు రూ.45వేల కోట్లకు పైగా ఖర్చు చేయనున్నట్లు వివరించారు.

చలి, మంచు వాతావరణంలో చైనా ఆర్మీ విన్యాసాలు!

మరోసారి వెనకడుగు వేసిన ఇస్రో!… కారణం ఏంటంటే?

Back to top button