
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- ఈ సంవత్సరం ఐపీఎల్ కు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తమ సెకండ్ హోమ్ గ్రౌండ్ గా విశాఖపట్నం క్రికెట్ స్టేడియం ఎంచుకున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే తాజాగా విశాఖపట్నంలో ఐపీఎల్ సందడి మొదలైందనే చెప్పాలి. ఎందుకంటే ఈనెల 24వ తారీకున ఢిల్లీ క్యాపిటల్స్ మరియు లక్నో సూపర్ జైంట్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్న సందర్భంగా మ్యాచ్ టికెట్లను ఇవాళ సాయంత్రం నాలుగు గంటల నుంచి డిస్ట్రిక్ట్ యాప్ లో అందుబాటులో ఉంచునున్నారు. ఈ సంవత్సరం విశాఖను ఢిల్లీ క్యాపిటల్స్ సెకండ్ హోమ్ గా ఉండుగా ఎంచుకొని పలు మ్యాచ్లను ఇక్కడ నిర్వహిస్తుంది. అంతేకాకుండా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఆడుతున్న తొలి మ్యాచ్ విశాఖపట్నంలోనే కావడం విశాఖ వాసులతో పాటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతకు అలాగే ప్రజలందరికీ కూడా ఇది ఒక ఎంటర్టైన్మెంట్ గా ఉండబోతుంది. ఇక ఈనెల 30వ తారీఖున ఢిల్లీ మరియు ఎస్ఆర్హెచ్ మధ్య మ్యాచ్ టికెట్లు ఎప్పటినుంచి అమ్ముతారనే దానిపై ఇంకా క్లారిటీ అనేది రాలేదు.
రేపే మహిళల ఐపీఎల్ ఫైనల్!… ఢిల్లీ ఈసారైనా కప్పుకొట్టేనా?
కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐపీఎల్ మ్యాచ్ జరగాలని యువత ఎంతగానో ఆవేదనలను వ్యక్తం చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఒక ఐపిఎల్ జట్టు ఉండాలి అని పెద్ద ఎత్తున క్రికెట్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా వాళ్ళ అభిప్రాయాలను తెలిపారు. కానీ తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో క్రికెట్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ జరుగుతుంది అని చెప్పడంతో యువత ఒక రకంగా చాలా సంతోషపడుతున్నారు. కాగా మార్చి 22వ తారీకు నుంచి ఐపీఎల్ 2025 ప్రారంభం కాబోతుంది. ఇక తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్ గా అక్షర పటేల్ ను నియమించడం జరిగింది.