
క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ యావత్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసింది. అయితే ఈ ఘటన ఎలా జరిగింది అనేది పోలీసులు విస్తృతస్థాయిలో విచారణ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ బాంబు బ్లాస్ట్ ఎఫెక్ట్ తో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని నగరాలు అలాగే పుణ్యక్షేత్రాలలో విస్తృతస్థాయి తనిఖీలు చేస్తున్నారు పోలీసులు. స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ అలాగే పోలీస్ డాగ్స్ స్క్వాడ్స్ తో పలు నగరాలలోని బస్టాండ్ అలాగే రైల్వే స్టేషన్స్లలో తనిఖీలు చేస్తూ ఉన్నారు. అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే వారిని ఆపి మరి చెకింగ్ చేస్తున్నారు. అన్ని జిల్లాల్లో పోలీసులు విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహించాలని రెండు తెలుగు రాష్ట్రాల జిల్లా కలెక్టర్లు ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. కలెక్టర్ల ఆదేశాలు మేరకు పోలీసులు విస్తృతస్థాయిలో తనిఖీలు చేపట్టడంతో ఏం తెలియనటువంటి చాలామంది ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే తెలంగాణలోని హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి ముఖ్య నగరాలలోని రైల్వే స్టేషన్, బస్టాండ్ లలో విస్తృత స్థాయిలో తనిఖీలు చేస్తున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం, విజయవాడ , గుంటూరు నగరాలలోని రైల్వే స్టేషన్లో అలాగే చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి తిరుపతి పుణ్యక్షేత్రంలో పూర్తిస్థాయిలో భద్రతాబలగాలు మోహరించాయి.
Read also : పెద్దిర్ పహాడ్ లో చిరుతపులుల సంచారం.. భయాందోళనలో గ్రామస్తులు?





