Actress Sreeleela: గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో శ్రీలీలకు సంబంధించిన బాత్ రూమ్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. తొలుత ఇవి నిజమైన ఫోటోలే అని అందరూ అనుకున్నా, ఆ తర్వాత అసలు నిజం తెలిసింది. వాటిని AI సాయంతో క్రియేట్ చేశారని నెటిజన్లు గుర్తించారు. తాజాగా ఏఐ జనరేటెడ్ ఫొటోస్ పై శ్రీలీల స్పందించింది. బాత్ రూమ్ లో టవల్ కట్టుకొని అద్దం ముందు సెల్ఫీలు దిగుతున్నట్లు ఉన్న ఈ ఫోటోలపై రియాక్ట్ అయ్యింది. నిజంగా అందులో ఉన్నది శ్రీలీల కాదు అని చెప్పడం ఆమె వల్ల కూడా కాదేమో. అంత పర్ఫెక్ట్ గా ఉన్నాయి. ఎప్పుడు ఇలాంటి ఫోటోలు షేర్ చేయని శ్రీలీల.. ఇలాంటి ఫోటోలు పెట్టిందేంటి అంటూ చాలామంది ఆమెను ట్రోల్ కూడా చేశారు.
చేతులు జోడించి వేడుకున్న శ్రీలీల
తన వైరల్ ఫోటోల గురించి శ్రీలీల షాకింగ్ విషయాలు చెప్పింది. అవి AIతో ఎడిట్ చేసిన ఫోటోలని స్పష్టం చేసింది. ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయొద్దని నెటిజన్స్ కి విజ్ఞప్తి చేసింది. “సోషల్ మీడియా వినియోగదారులందరూ ఏఐ జనరేటెడ్ లాంటి అర్ధంలేని విషయాలను సమర్ధించవద్దని నేను నా చేతులు జోడించి అభ్యర్థిస్తున్నాను. టెక్నాలజీని ఉపయోగించడం, దుర్వినియోగం చేయడం మధ్య తేడా ఉంది. టెక్నాలజీలో పురోగతి జీవితాన్ని సరళీకృతం చేయడానికి ఉద్దేశించబడింది, దానిని క్లిష్టతరం చేయడానికి కాదు అనేదినా అభిప్రాయం”.
తన బాధను అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి
“సినిమా రంగంలో ఉన్న ప్రతి అమ్మాయి.. మరొకరికి ఒక కుమార్తె, మనవరాలు, సోదరి, స్నేహితురాలు లేదా సహోద్యోగిగా ఉంటారు. మేము అందరం సురక్షిత వాతావరణంలో ఉన్నామని నమ్మకంతో ఆనందాన్ని పంచే పరిశ్రమలో భాగం కావాలని కోరుకుంటున్నాము. నా షెడ్యూల్ కారణంగా ఆన్‌లైన్‌లో జరుగుతున్న అనేక విషయాల గురించి నాకు తెలియదు. దీనిని నా దృష్టికి తెచ్చినందుకు నా శ్రేయోభిలాషులకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నా ప్రపంచం నాదే.. నేను చిన్న విషయాలను పట్టించుకోను. కానీ, ఇది మాత్రం నన్ను ఎంతో బాధిస్తుంది. ఇలాంటివే నా తోటి నటులు కూడా ఎదుర్కొంటున్నట్లు నేను చూస్తున్నాను. వారి అందరి తరపున కూడా చేరుతున్నాను. గౌరవంతో నా ప్రేక్షకులపై నమ్మకంతో, దయచేసి మాతో నిలబడమని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. మిగతాది అధికారులు చూసుకుంటారు” అని సోషల్ మీడియా వేదికగా రాసుకొచ్చింది.
— Sreeleela (@sreeleela14) December 17, 2025





