Friday, February 27, 2026
Homeఆంధ్ర ప్రదేశ్వెలుగొండ ప్రాజెక్టు పై అసెంబ్లీలో మళ్లీ చర్చ.. సీఎం ఏమన్నారంటే?

వెలుగొండ ప్రాజెక్టు పై అసెంబ్లీలో మళ్లీ చర్చ.. సీఎం ఏమన్నారంటే?

క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 25వ తేదీన నూతన మార్కాపురం జిల్లాలో పర్యటించి వెలిగొండ ప్రాజెక్టును సందర్శించిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే ఆ తర్వాత మళ్లీ జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు వెలుగొండ ప్రాజెక్టుపై మాట్లాడుతూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. వెలుగొండ ప్రాజెక్టు పూర్తికాకుండానే గత ప్రభుత్వం జాతికి అంకితం చేసి ప్రజలను తారాస్థాయిలో మోసం చేసినట్లు తెలిపారు. కానీ ఇచ్చిన హామీ ప్రకారం ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే మరో 14 వారాల్లో ప్రాజెక్టు పూర్తి చేసి నూతన జిల్లా మార్కాపురం మరియు ప్రకాశం జిల్లాలకు నీరు అందించి ఇచ్చిన హామీని నెరవేరుస్తాము అని సీఎం స్పష్టం చేశారు. మార్కాపురం,ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా ఈ వెలుగొండ ప్రాజెక్టుపై ఆధారపడి ఉన్నారు అని.. వెలుగొండ ప్రాజెక్టు నీరు ఆ జిల్లాలలోని వ్యవసాయానికి చాలా ప్రాధాన్యత సంతరించుకుంది అని అన్నారు. దీంతో ఎలాగైనా జులై నాటికి వెలుగొండ నుంచి తాగునీరు మరియు సాగునీరు తప్పనిసరిగా అందజేస్తాము అని సీఎం పేర్కొన్నారు. వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయడానికి ఎంత డబ్బు ఖర్చయిన పర్లేదు కానీ ప్రజలు ఆశ నెరవేరాలి అని తెలిపారు.

Chief Justice: ఏపీ హైకోర్టుకు తొలి మహిళా సీజేగా జస్టిస్ లీసా గిల్?

ఏ పనులు పూర్తికాకుండానే జాతికి అంకితం చేశారు : చంద్రబాబు

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments