
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలన సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో… తాజాగా కోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు అయినటువంటి మారుతీ రావును A1 గా ప్రకటించిన మారుతీ రావు ఆత్మహత్య చేసుకుని చనిపోగా A2 నిందితుడైనటువంటి సుభాష్ శర్మకు మరణశిక్షను విధించింది. ఇక మిగతా ఆరుగురికి యావజ్జీవ కారాగారా శిక్ష విధిస్తూ నల్గొండ రెండో అదనపు జిల్లా కోర్ట్ జడ్జి రోజా రమణి తీర్పునివ్వడం జరిగింది. కేసు పూర్వ వివరాల్లోకి వెళితే మిర్యాలగూడకు చెందిన తిరునగరు మారుతీ రావు కుమార్తె అమృత వర్షిని మరియు పెరుమాళ్ళ ప్రణయ్ 9వ తరగతి నుంచి కలిసి చదువుకున్నారు. ఆ స్నేహం ప్రేమగా మారింది. కులాలు వేరు కావడంతో పెద్దలు తమ ప్రేమను అంగీకరించరని గ్రహించి వారిద్దరు 2018లో జనవరి 31న హైదరాబాద్ ఆర్య సమాజ్లో పెళ్లి చేసుకున్నారు. తన కూతురు అమృత ఒక ఎస్సీ కులానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకోవడంతో అది జీర్ణించలేక మారుతీ రావు, ఆ పెళ్లి నీ పెటాకులు చేసేందుకు ప్రయత్నించారు. ఒకానొక సమయంలో మా కుమార్తెను వదిలేస్తే కోటి యాభై లక్షలు ఇస్తామంటూ ప్రణయ్ తల్లిదండ్రులను మభ్య పెట్టారు.
వైభవంగా యాదాద్రి నరసన్న బ్రహ్మోత్సవం
కానీ ఆ డబ్బులకు అతను లొంగలేదు. ఇక అంతా కూడా ప్రశాంతంగా ఉందనుకున్న సమయంలో ప్రణయ్ నీ హత్య చేయించాలని నిర్ణయించుకొని… మిర్యాలగూడ కు చెందిన మహమ్మద్ అబ్దుల్ కరీం కు కోటి రూపాయలు సుఫారీ ఇచ్చాడు. ఇక మొత్తం కూడా ఒక గ్యాంగ్ తయారు చేసుకొని గర్భిణిగా ఉన్న అమృతను ప్రణయ్ 2018 సెప్టెంబర్ 14న మిర్యాలగూడలోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లిన సమయంలో… సుభాష్ శర్మ అతన్ని కత్తితో పొడిచి చంపడం జరిగింది.
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి: రాజ్ కుమార్ రెడ్డి
ఈ ఘటనను చూసినా అమృత ప్రణయ్ తల్లి ప్రేమలత పెద్ద ఎత్తున కేకలు వేస్తూ కళ్ళు తిరిగి పడిపోయారు. ప్రణయ్ తండ్రి బాలస్వామి ఫిర్యాదు మేరకు మిర్యాలగూడ వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు. అప్పట్లో ఈ హత్య అనేది దేశవ్యాప్తంగా తెగ సంచలనం సృష్టించింది. కుల మతాలకు వ్యతిరేకంగా ర్యాలీలు, ఆందోళనలు చేశారు. ప్రజా సంఘాల నేతలు ఈ హత్యను తీవ్రంగా ఖండించడం జరిగింది. ఇక ఈ కేసును అప్పట్లో సీరియస్గా తీసుకున్న నల్గొండ జిల్లా ఎస్పీ ఏవి రంగనాథ్ నాలుగు రోజుల్లో 8 మంది నిందితులను అరెస్టు చేశారు.