
హైదరాబాద్ శివారులోని హయత్‌నగర్ లక్ష్మారెడ్డిపాలెంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అడిషనల్ ఎస్పీ నందీశ్వర బాబ్జీ మృతిచెందారు. డీజీపీ కార్యాలయంలో అడిషనల్ ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న బాబ్జీ.. ఇవాళ ఉదయం లక్ష్మారెడ్డిపాలెంలో వాకింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో రోడ్డు దాటుతుండగా ఏపీఎస్‌ఆర్టీకి చెందిన బస్సు ఆయనను ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన బాబ్జీ అక్కడికక్కడే మృతిచెందారు.
రోడ్డు ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాదీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు. డీసీపీ బాబ్జి లక్ష్మారెడ్డిపాలెంలోని మైత్రి కుటీర్‌లో నివాసం ఉంటున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి …
-
జగన్‌కు ఏడుగురు ఎమ్మెల్యేల వెన్నుపోటు – రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారుగా…!
-
రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ప్రారంభం!..
-
కాలం తెచ్చిన కరువు కాదు… పక్కా కాంగ్రెస్ తెచ్చిన కరువే.
-
టీడీపీని తొక్కుకుంటూ పైకొస్తున్న జనసేన – తిరుపతి చంద్రబాబు పర్యటనే సాక్ష్యం
-
2029లో టీడీపీ అధికారంలో ఉండటం కష్టమేనా – చరిత్ర ఏం చెప్తోంది..?