
మహేశ్వరం, ప్రతినిధి (క్రైమ్ మిర్రర్):-
ఇజ్రాయిల్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని మాదిగల జాగృతి సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అందుగుల సత్యనారాయణ అన్నారు. ఇజ్రాయిల్ కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ కందుకూరు చౌరస్తా నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేసిన మాదిగల జాగృతి సంఘం, ఈ సందర్బంగా మాట్లాడుతూ …ఇటీవల ఆత్యాకు గురైన ఇజ్రాయిల్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ న్యాయం చేసే వరకు మాదిగల న్యాయ పోరాటం ఆగదన్నారు.దళితులపై దాడులు జరుగుతున్న పట్టించుకునే నాధుడే లేకుండా పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా గొంతు గద్దర్ ప్రశ్నించే గొంతుక లేకపోయేసరికి అందరూ అనాధలకు మిగిలారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మాదిగలందరూ మూకుమ్మడిగా ఇజ్రాయిల్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఐక్యమత్యంగా పోరాటం చేస్తామని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి వెంటనే కుటుంబానికి న్యాయం చేయాలని,లేనిపక్షంలో మహేశ్వరం నియోజకవర్గంలో తిరగకుండా అడ్డుకుంటామని మాదిగల జాగృతి సేవా సంఘం హెచ్చరించింది.