
క్రైమ్ మిర్రర్, న్యూస్ :- తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు భారీ తుఫాన్ ప్రభావం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న రెండు రోజులపాటుగా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తాజాగా ఏర్పడ్డ అల్పపీడనం మరికొన్ని గంటలలో తుఫానుగా మారేటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం తమిళనాడు తీరానికి దగ్గరగా ఉండడంతో… క్రమంగా ఇది ఉత్తర దిశకు కదిలి ఆంధ్రప్రదేశ్ తీరాన్ని సోమవారం నాడు చేరనుంది. దీంతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం తో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో కూడా భారీగా వర్షాలు పడేటువంటి అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేసింది. ఇక దక్షిణాది ఇతర రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఆయా రాష్ట్ర ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది.
ఇక ఈ రాష్ట్రాలలో దాదాపు గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల మేరా గాలులు వీయ వచ్చని తెలిపింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్, బెల్లంపల్లి, జగిత్యాల, మహబూబ్నగర్, గద్వాల్ జిల్లాలలో భారీ వర్షాలు పడవచ్చు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాయలసీమ మరియు కోస్తాంధ్ర జిల్లాలలో భారీ వర్షాలు పడతాయి. ఎక్కువగా రాత్రి సమయంలో కుండపోత వర్షాలు కొనసాగుతూ ఉండవచ్చు అని వాతావరణ శాఖ తెలిపింది. కాబట్టి ఆయా ప్రాంతాల ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేశారు. వర్షం పడుతున్న సమయంలో బయట ఎవరూ కూడా ఉండకూడదని తెలిపింది.
నక్షా పేరిట ప్రభుత్వం కీలక నిర్ణయం!.. ఇకపై భూ వివాదాలు ఉండబోవు?
భారత్ ఆర్మీ ఏ గెలిచింది… అసలు నిజం ఒప్పుకున్నా పాకిస్తాన్ ప్రధాని?