
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- ఐపీఎల్ 2025 అట్టహాసంగా సాగుతోంది. ఈ సంవత్సరం ఐపీఎల్లో ఉన్నటువంటి పది జట్లు కూడా చాలా బలంగా కనిపిస్తున్నాయి. అయితే ఈ ఐపీఎల్లో మొదటి మ్యాచ్లో శుభారంభం చేసిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తర్వాత జరిగిన రెండు మ్యాచ్ల్లోనూ ఓడిపోయింది. దీంతో సీఎస్కే పై అభిమానులు తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. 2019 నుంచి సీఎస్కే జట్టు 180 పైగా టార్గెట్ ను చేదించలేకపోయింది. ఇప్పటివరకు దాదాపుగా 9సార్లు చేజింగ్ కొద్దిగా అన్నింట్లోనూ ఆ జట్టు ఓటమికి గురి అయింది. మరి ఇతర జుట్టు చేజింగ్ లో వరుసగా ఇన్ని మ్యాచులు ఓడిపోయిన సందర్భాలు అసలు లేవు. ఇక ఐపీఎల్ చరిత్రలోనే ఓవరాల్ గా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 180 పైగా చేంజింగ్ కోసం 27 సార్లు బరిలోకి దిగి 15 సార్లు మాత్రమే గెలిచింది. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఇందులో సురేష్ రైనా ఆడిన 13 మ్యాచ్ల్లో విజయం సాధించింది. ఇక ఆ తరువాత ఒక మ్యాచ్ లోను సీఎస్కే జట్టు 180 పైగా చేజింగ్ చేసిన మ్యాచ్లలో గెలవలేదు.
పవన్ జాతకం సూపర్ – మరి చంద్రబాబు, జగన్ పరిస్థితి ఏంటి?
మహేంద్రసింగ్ ధోని, జడేజా, రుతురాజు గైక్వాడ్, త్రిపాఠి, శివం దుబే, శాంకరణ్ లాంటి స్టార్ ప్లేయర్లు ఉన్నా కూడా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు చేజింగ్ లో విఫలమవుతుంది. తాజాగా రాజస్థాన్ రాయల్స్ జట్టుపై కూడా చెన్నై 182 పరుగుల లక్ష్యాన్ని చేదించలేక ఓడిపోయింది. దీంతో చెన్నై జుట్టుపై అభిమానులు చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 170 పైగా రన్స్ చేజింగ్ లో చెన్నై జట్టు చేదించడంలో విఫలమవుతుందని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ధోనిని తొమ్మిదవ స్థానంలో కాకుండా ఆరవ నేను ఏడవ స్థానంలో పంపించాలని ఫ్యాన్స్ కోరుతున్నారు.
హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎంఐఎందేనా..? – పోటీకి ముందుకు రాని ప్రధాన పార్టీలు