
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- తిరుమల తిరుపతి లో సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరుసగా మూడు రోజులపాటు సెలవులు రావడంతో శ్రీవారి దర్శనానికి భక్తులు భారీగా కదిలి వచ్చారు. టోకెన్లు తీసుకోకుండా శ్రీ వెంకటేశ్వర స్వామి సర్వ దర్శనానికి ఏకంగా 18 గంటల సమయం పడుతుంది. ఇక మరోవైపు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 31 కంపార్ట్మెంట్లలో వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం వేల మంది భక్తులు వేచి ఉన్నారు. నిన్న ఒక్కరోజునే ఏకంగా 62,263 మంది భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అందులో 25,733 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు.
అంబిటస్ ది స్కూల్ పై వస్తున్న వదంతులు పూర్తిగా అవాస్తవం
ఇక శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు భారీగా కదలి వస్తుండడంతో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లను చేశారు. ఇటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కూడా భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక ఎక్కువ మంది భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో శ్రీవారి ఆలయ ఉండి ఆదాయం కూడా భారీగానే వచ్చింది అని అధికారులు వెలిగించారు. దాదాపుగా 3.65 కోట్లు వచ్చినట్లుగా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. కాబట్టి భక్తుల రద్దీని దృశ్య ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని స్పెషల్గా ఆహారం ను కూడా అందిస్తున్నారు.