క్రైమ్జాతీయం

Crime: ఐస్‌క్రీం ఇచ్చి ముగ్గురు పిల్లలపై అత్యాచారం

Crime: ఒడిశా రాష్ట్రంలోని మల్కాన్‌గిరి జిల్లా కలిమెల సమితిలో చోటుచేసుకున్న ఓ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Crime: ఒడిశా రాష్ట్రంలోని మల్కాన్‌గిరి జిల్లా కలిమెల సమితిలో చోటుచేసుకున్న ఓ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. గ్రామానికి చెందిన ముగ్గురు చిన్నారులు బయట ఆడుకుంటున్న సమయంలో, అదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి వారికి ఐస్ క్రీం ఇస్తానని చెప్పి తన ఇంటికి తీసుకెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అమాయకంగా అతని వెంట వెళ్లిన చిన్నారులను లైంగికంగా దాడి చేసి, ఈ విషయం ఎవరికి చెప్పొద్దని బెదిరించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఇంటికి చేరుకున్న చిన్నారుల ప్రవర్తనలో మార్పు గమనించిన కుటుంబ సభ్యులు వివరాలు అడగగా, భయంతో వారు జరిగిన విషయాన్ని వెల్లడించారు. దీంతో వెంటనే చిన్నారుల తల్లిదండ్రులు మంగళవారం ఠాణాకు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఈ చిన్నారుల వయస్సు 9 సంవత్సరాల లోపే ఉండటంతో ఘటన మరింత బాధాకరంగా మారింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా, నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలిసింది. అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ALSO READ: True love stories: పోలీస్‌స్టేషన్‌లో ఒక్కటైన ‘మూగ’ జంట

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button