
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :-
కొన్ని రాష్ట్రాలలో ఖజానా ఖాళీలు..?
నిజమేనా!..
మొన్న రేవంత్…
నిన్న చంద్రబాబు…
నేడు ఢిల్లీ సీఎం రేఖ…
– ‘మా దగ్గర డబ్బులు లేవు.. ఖజానా ఖాళీ’
క్రైమ్ మిర్రర్ ప్రత్యేక కథనం
భారతదేశంలో ఇటీవల కొత్తగా ముఖ్యమంత్రులు అయినటువంటి వారు ఖజానా ఖాళీ అయింది.. మా దగ్గర ప్రస్తుతం డబ్బులు లేవు అని చెబుతున్న మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత పథకాలు అమలు చేద్దామన్నా లేదా ఆర్థికపరంగా నిర్ణయాలు తీసుకుందామన్నా.. ఎక్కడా చూసినా కూడా ఖజానా ఖాళీగానే కనిపిస్తుంది. ఈమధ్య తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి ఇలానే అన్నారు. మొన్న కాక నిన్న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నికైన నారా చంద్రబాబునాయుడు కూడా ఇదే మాట అన్నారు. అయితే ఇప్పుడు మళ్లీ కొద్ది రోజుల క్రితం న్యూఢిల్లీకి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేఖ కూడా ఇదే మాట అనడం దేశంలో సంచలనగా మారింది. అయితే ఇక్కడ వీరందరూ కూడా కామన్ గా ఒక పాయింట్ చెప్పుకొస్తున్నారు.
మరి ఈ రాష్ట్రాల పరిస్థితి ఏంటి
మేము రాకముందు గత పాలన లో ముఖ్యమంత్రులుగా ఉన్న నాయకులు రాష్ట్రాలను చిన్నభిన్నం చేశారు అని ప్రస్తుత ముఖ్యమంత్రి చెప్పుకొస్తున్నారు. అంటే దీని అర్థం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్.. ఢిల్లీలో కేజ్రివాల్ వీళ్ళందరూ ముఖ్యమంత్రులుగా ఉన్న సమయంలో వాళ్ళు తీసుకున్నటువంటి కీలక నిర్ణయాల వల్లే ఇవాళ ఖజానా ఖాళీ అయిందని సోషల్ మీడియా అంతటా కూడా ప్రతిపక్ష నేతలు చర్చలు చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఇదే దేశవ్యాప్తంగా చర్చకు దారి తీస్తుంది. రేపటి పాలకులు అంటే భవిష్యత్తులో ముఖ్యమంత్రులు అయ్యేవారు ఈ మాట చెప్పకుండా ఉండాలంటే ప్రస్తుతం రాష్ట్రంలో ఇచ్చిన ఉచిత పథకాలను ఆపేయడమే పరిష్కార మార్గముగా కనపడుతుంది. ఇది మేము చెబుతున్న మాట కాదు చాలామంది రాజకీయ విశ్లేషకులు కూడా ఉచిత పథకాలు ఆపేస్తేనే ఖజానా నిలబడుతుందని చెప్తున్నారు.
మరి ఇప్పుడు మనం ఉన్న పరిస్థితులలో రాష్ట్రంలో ప్రజలకు ఉచిత పథకాలు ఇవ్వకపోతే కచ్చితంగా పార్టీ గెలిచే సత్తా కలిగి ఉండదు. ఉచిత పథకాలు కనుక ఎన్నికల సమయంలో ఇవ్వకపోతే కచ్చితంగా ఆయ రాష్ట్ర ప్రజలు వారికి ఓటు వేయరు. ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి కూడా ఉచిత పథకాలు, డబ్బు, మద్యం ఇలాంటివి పంచి పెట్టకపోతే వాళ్లకు ఓటు వేసే పరిస్థితి లేదు. మరి ఈ సందర్భంలో రాష్ట్రంలో ఎలా ఖజానా మిగులుతుంది… అనే ప్రశ్నలు చాలామందిలో ఎదురయ్యే ఉంటాయి. కాబట్టి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కువగా అనవసరపు వాటికి ఖర్చులు చేయకుండా ప్రజలకు ఎటువంటి మంచి చేస్తే ఖజానా అనేది మిగులుతుంది అనేది అర్థం చేసుకోవాలి. దానికి తగిన నిర్ణయాలు కూడా తీసుకోవడంలో ముందు చూపుతో ఉండాలి. కేవలం హామీలు ఇస్తే సరిపోదు వాటిని ఎలా నెరవేర్చాలో దానికి పక్క ప్రణాళికలు వేయాలి. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి అనేది కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి పై ఆధారపడి ఉంటుంది. అలాగే ఎమ్మెల్యేలు మరియు ఎంపీలు వారికి ఇచ్చిన శాఖలను సక్రమంగా.. సరైన సమయంలో ఎలా పూర్తి చేయాలో అనే పక్క ప్రణాళిక ఉంటే మాత్రం ఖజానా ఖాళీ అవదు అని చాలామంది విశ్లేషకులు అంటున్నారు. ప్రజలకు ఉచిత పథకాలు పేరిట వాళ్లని మాయలో దించి… మనము అధికార పీఠంలో కూర్చుని మళ్లీ వాటిని ఎలాగైనా ప్రజల దగ్గర నుంచి రాబట్టాలని ఆలోచన ఉంటే మాత్రం రాష్ట్రం అభివృద్ధి చెందకపోవడమే కాకుండా… మరింత దిగజారి పోతుందని అర్థం చేసుకోవాలి.
ఇది కూడా చదవండి