
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- యథేచ్ఛగా చెరువులో మట్టి తవ్వకాలు…తవ్వుకున్నోడికి తవ్వుకున్నంత.! అనే కథనానికి అధికారులు స్పందించారు. క్రైమ్ మిర్రర్ దినపత్రికలో ఈ నెల 14న ప్రచురితమైన యథేచ్ఛగా చెరువులో మట్టి తవ్వకాలు…తవ్వుకున్నోడికి తవ్వుకున్నంత.! అనే వార్త శీర్షికకు మండల ఇరిగేషన్ ఏఈఈ పృథ్వీ స్పందించారు. ఈ సందర్భంగా సంబంధిత దేవలమ్మ నాగారం గ్రామంలోని దేవలమ్మ చెరువులో అక్రమ మట్టి తవ్వకాలు జరిగిన ప్రాంతాన్ని సిబ్బందితో కలిసి ఆమె పరిశీలించారు.
ఎలాంటి షరతులు లేకుండా రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేయాలి
ఈ సందర్భంగా ఇరిగేషన్ ఏఈఈ మాట్లాడుతూ.. చెరువులో నుంచి ఇష్టానుసారంగా మట్టి తవ్వకాలు నిర్వహిస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇప్పటికైనా ఇలాంటి చర్యలు మానుకోవాలని లేకుంటే క్రిమినల్ కేసులను సైతం నమోదు చేస్తామని హెచ్చరించారు. అక్రమ తవ్వకాలపై తహసీల్దార్, ఆర్డివో లకు తెలియపరచామని అన్నారు. అదేవిధంగా స్థానిక పోలీస్ స్టేషన్ లో ఎస్ హెచ్ ఓ కి ఫిర్యాధు చేసినట్లు తెలిపారు. అర్ధరాత్రి సమయంలో సంబంధిత స్థలంలో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించవలసిందిగా ఫిర్యాధు లో పేర్కొన్నట్లు తెలిపారు. పూర్తి విచారణ జరిపి బాధ్యులపై మైనింగ్ చట్టంలోని నిబంధనల ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. అక్రమ తవ్వకాలు, రవాణాపై గట్టి నిఘా పెడతామని, అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరైనా తవ్వకాలు జరిపితే తమకు సమాచారం అందివ్వాలని సూచించారు. తనిఖీలలో వారి వెంట సిబ్బంది ఉన్నారు.
కుంభమేళాలో పవిత్ర స్నానం చేసిన రఘునందన్ రెడ్డి ఫ్యామిలీ
300 మంది చిన్నారులపై అత్యాచారం – జంతువులనూ వదలని మాజీ సర్జన్