
క్రైమ్ మిర్రర్, సినిమా న్యూస్ :- టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులకు ఇది ఒక గుడ్ న్యూస్. కాంతార సినిమా దేశవ్యాప్తంగా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో ప్రతి ఒక్కరికి చెప్పనవసరం లేదు. కాంతార సినిమా ద్వారా హీరో రిషబ్ శెట్టి కి కూడా ఒక్కసారిగా ఫాన్ ఫాలోయింగ్ పెరగడమే కాకుండా ఇప్పుడు ఏకంగా సినిమాకి 50 కోట్లకు పైగానే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. అయితే ఈ మధ్యనే కాంతారా చాప్టర్ -1 షూటింగ్ పూర్తి చేసుకున్నారు. అయితే ఇక ఈ సినిమాకు సంబంధించి పార్ట్ 3 కూడా ఉంటుంది అని… అందులో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒక కీలకపాత్ర పోషించబోతున్నారని సినిమా వర్గాలు పేర్కొన్నాయి.
Read also : నేడు రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల పట్టాల పంపిణీ
అయితే ఈ విషయంపై ఇంకా అధికారికంగా ప్రకటన అయితే రావాల్సి ఉంది. ఒకవేళ కాంతార 3 లో జూనియర్ ఎన్టీఆర్ కనుక కీలకపాత్రలో నటిస్తే మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల ఎన్టీఆర్ అభిమానులకు మాత్రం ఒక పండుగని చెప్పాలి. దీంతోపాటుగా థియేటర్లన్నీ కూడా దదిరిల్లిపోతాయని అనడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. తాజాగా కాంతారా చాప్టర్ -1 పూర్తి చేసుకున్న చిత్ర బృందం.. కాంతార పార్టీ 3 తెరకెక్కించేందుకు ప్లాన్లు చేస్తున్నట్లు సమాచారం అందింది. ఇందులో భాగంగానే హీరో రిషబ్ శెట్టి తో పాటుగా ఒక ఫేమస్ హీరోను తీసుకోవాలని… అది జూనియర్ ఎన్టీఆర్ అని సినిమా వర్గాల నుండి సమాచారం వచ్చింది. ఇక ఈ విషయం తెలుసుకున్న జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కేరింతలతో ఎగిరి గంతులు వేస్తున్నారు.
Read also : సీఎం వ్యాఖ్యలపై మరోసారి మండిపడ్డ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి