జాతీయం

కొత్త ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్‌

  • ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్‌ రెడ్డిపై గెలుపు

  • ఎన్డీయే అభ్యర్థి రాధాకృష్ణన్‌కు 452 ఓట్లు

  • ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్‌ రెడ్డికి 300ఓట్లు

క్రైమ్‌మిర్రర్‌, న్యూఢిల్లీ: భారత 17వ ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్‌ ఎన్నికయ్యారు. ఈరోజు జరిగిన ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్‌ రెడ్డిపై 152 ఓట్ల మెజార్టీతో ఎన్డీయే అభ్యర్థి రాధాకృష్ణన్‌ గెలుపొందారు. మొత్తం 781 ఓట్లకు గాను 767 మంది ఎంపీలు వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్డీయే తరపున ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేసిన సీపీ రాధాకృష్ణన్‌కు 452 మొదటి ప్రాధాన్యత ఓట్లు సాధించారు. ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్‌ రెడ్డికి 300 ఓట్లు పడ్డాయి. బీఆర్‌ఎస్‌, బీజేడీ, శిరోమణి అకాళీదళ్‌ పార్టీల ఎంపీలు ఓట్లు వేయలేదు. ఈ ఓటింగ్‌కు 14మంది ఎంపీలు గైర్హాజరయ్యారు. 15మంది ఎంపీల ఓట్లు చెల్లుబాటు కాలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button