
దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. సింగపూర్, హాంకాంగ్ ను అల్లకల్లోలం చేస్తున్న కరోనా… క్రమంగా మన దేశంలోనూ విజృంభిస్తోంది. ముంబైలో కరోనా సోకి ఇద్దరు మృతి చెందడం తీవ్ర కలకలం రేపుతోంది. ముంబైలోని కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ ఆస్పత్రిలో 14ఏళ్ల బాలుడు, 54ఏళ్ల వ్యక్తి కరోనాతో మృతి చెందారు. అయితే వారిలో ఇతర అనారోగ్యాలు కూడా ఉన్నాయని ఆస్పత్రి వైద్యులు తెలిపారు.
దక్షిణ ఆసియా దేశాల్లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. సింగపూర్, చైనా, థాయిలాండ్‌లో కేసులు పెరుగుతున్నాయి.చైనాలో ప్రమాదకరస్థాయిలో కేసులు పెరుగుతున్నాయి. దేశంలో కొత్తగా 257 కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే ఈ కేసులు స్వల్ప తీవ్రతలోనే ఉన్నట్లు తెలిపింది కేంద్ర ఆరోగ్య శాఖ. గత కొన్ని వారాలుగా సింగపూర్, హంకాంగ్‌లో విపరీతంగా పెరిగిపోతున్నాయి కరోనా కేసులు.