
క్రైమ్ మిర్రర్, మర్రిగూడ:-మండల పరిధిలోని ఓ బాలికపై లైంగికదాడికి పాల్పడిన నేరస్థుడికి 10ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ, ఎస్సీ ఎస్టీ నల్లగొండ కోర్టు అదనపు న్యాయమూర్తి ఎన్.రోజారమణి మంగళవారం సంచలన తీర్పు వెల్లడించారు. మర్రిగూడ మండలంలోని ఒక గ్రామానికి చెందిన 14 ఏళ్ల వయసున్న బాలిక 22 ఆగస్టు 2016న బహిర్భూమికి వెళ్లగా, తిరుగండ్లపల్లి గ్రామానికి చెందిన పోలే నరేష్ ఆ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెప్పితే తనను చంపేస్తానని బెదిరించాడు. అయినా భయపడకుండా బాలిక తన తల్లికి జరిగిన విషయం చెప్పడంతో, వెంటనే మర్రిగూడ పోలీస్ స్టేషన్ కు వెళ్లి బాధితురాలు ఫిర్యాదు చేశారు. మర్రిగూడ ఎస్ఐ కె.బలరాం 92/2016 ఎస్సీ నెం 38/2017, యూ/ఎస్, 376(ఐ), 506 ఐపీసీ, ప్రకారం పోక్సో చట్టం-2012, సెక్షన్ 4 ప్రకారం కేసు నమోదైంది.
Read also: అమెరికా మద్దతు ఇచ్చినప్పుడల్లా రెచ్చిపోవడం పాక్ ఆర్మీ చీఫ్ కు అలవాటే : భారత్
నాంపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ బాలగంగిరెడ్డి ఆ కేసును దర్యాప్తు చేసి, కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. కేసు వాయిదాలపై వస్తూ మంగళవారం ఫైనల్ కు వచ్చింది. ప్రస్తుత నాంపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ దూది రాజు సాక్షదారాలతో, న్యాయమూర్తి ఎదుట ప్రవేశ పెట్టగా, జడ్జి రోజారమణి కేసు పూర్వపరాలను పరిశీలించి, బీఎన్ఎస్ 376 (2) (ఎం) లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ చట్టంలోని, సెక్షన్ 5(కే) ఆర్డబ్ల్యూ 6 కింద శిక్షార్హమైన నేరాలకు పాల్పడినట్లు తేలింది. దీని ప్రకారం సెక్షన్ 235 (2) సెక్షన్ల కింద నిందితుడు నరేష్ ను కోర్టు దోషిగా నిర్ధారించింది. 20ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు, పదివేల రూపాయల జరిమానా విధిస్తూ మంగళవారం తీర్పు వెళ్లడించారు. జరిమానా చెల్లించకపోతే మరో ఆరు నెలల సాధారణ కారాగార శిక్ష అనుభవించాల్సి ఉంటుందని వెల్లడించారు. అయితే బాధిత బాలిక మానసికంగా అనుభవించిన బాధకు పరిహారంగా, ప్రభుత్వం నుంచి అయిదు లక్షల రూపాయలు అందేలా చూడాలని న్యాయమూర్తి ఆదేశించారు. పోక్సో చట్టం కేసుల ఫాస్ట్ ట్రాక్ కోర్టు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, వేముల రంజిత్ కుమార్, బరోసా సెంటర్ లీగర్ ఆఫీసర్, అదనపు పీపీ కల్పన, నాంపల్లి సీఐ రాజు, అనుసంధాన అధికారులు నరేందర్, మల్లికార్జున్ లను, పోలీస్ సిబ్బందిని నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అభినందించారు.
Read also : వరంగల్లో భారీ వర్షాలు.. పూర్తిగా మునిగిపోయిన రైల్వే పట్టాలు!