
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- భారత ఆర్మీ ని అవమానించేలా వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ పై కేసు నమోదైన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ కేసులో లక్నోలోని ప్రత్యేక ఎంపీ- ఎమ్మెల్యే కోర్టు సమన్లు జారీ చేసింది. మార్చి 24వ తేదీన తమ ముందు హాజరుకావాలని రాహుల్ గాంధీని కోర్టు ఆదేశించింది. ” భారత జూడో యాత్ర ” సందర్భంగా డిసెంబర్ 2022లో రాహుల్ గాంధీ మాట్లాడుతూ భారతదేశ ఆర్మీ అవమానించేలా వ్యాఖ్యలు చేశారని బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ మాజీ డైరెక్టర్ ఉదయ్ శంకర్ శ్రీ వాస్తవ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
హనుమాన్ ఆలయంలో మాంసం ముద్దలు.. హైదరాబాద్ లో హైటెన్షన్
రాహుల్ గాంధీ తన వ్యాఖ్యలతో భారతదేశ ఆర్మీని అవమానించారని తన ఫిర్యాదులో రాసుకు వచ్చారు. జాతీయ సరిహద్దులను కంటికి రెప్పలా కాపాడుతున్న ఆర్మీపై రాహుల్ గాంధీ అలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని అన్నారు. ఈ నేపథ్యంలోనే అడిషనల్ చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టు రాహుల్ గాంధీకి తాజాగా నోటీసులు జారీ చేసింది. కాగా 2022 డిసెంబర్ 9వ తారీఖున రాహుల్ గాంధీ విలేకరులతో మాట్లాడుతూ.. చైనా గురించి మీడియా తనను ఏమీ అడగదని తన స్నేహితుడితో పందెం కట్టానని తెలిపారు. 2000 చదరపు కిలోమీటర్ల భారత భూమి బాగాన్ని ఆక్రమించిన దేశం గురించి, మన సైనికులను చంపిన దేశం గురించి, అరుణాచల్ ప్రదేశ్ లో మన సైనికులపై దాడి చేస్తున్న దేశం గురించి ‘ప్రెస్’ నన్నేమీ అడగదని పేర్కొన్నారు. తాను చెప్పింది నిజమేనని, దేశం మొత్తం కూడా గమనిస్తుందని వేరేలా ఆలోచించవద్దు అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
‘ఎమ్మేల్సీ’ పులి సరోత్తం రెడ్డిని గెలిపించాలి!… రాష్ట్రంలో మళ్లీ రాజకీయ గాలులు?
అయితే రాహుల్ గాంధీ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వివాదాస్పదమయ్యాయి. 2022 డిసెంబర్ 12న రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై ఆర్మీ స్పష్టత ఇచ్చింది. చైనా ఆర్మీ అరుణాచల్ ప్రదేశ్ లోకి అక్రమంగా ప్రవేశించింది అంటూ, దానిని ఇండియన్ ఆర్మీ బలంగా తిప్పి కొట్టిందని తెలిపారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రేపటితో ఎనిమిది నెలలు: సీఎం