Tuesday, March 17, 2026
Homeక్రైమ్IBomma Ravi: ఐబొమ్మ రవికి కోర్టు షాక్.. 12 రోజుల పోలీస్ కస్టడీ!

IBomma Ravi: ఐబొమ్మ రవికి కోర్టు షాక్.. 12 రోజుల పోలీస్ కస్టడీ!

iBomma Ravi Police Custody: తెలుగు సినిమా పరిశ్రమ గుండెల్లో వణుకు పుట్టించాడు ఐబొమ్మ రవి. కొత్త సినిమాలు విడుదలైన గంటల్లో తన వెబ్ సైట్స్ లో అప్ లోడ్ చేసి తెలుగు సినీ పరిశ్రమకు తీవ్ర నష్టం కలిగించేలా చేశాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఐబొమ్మ, బప్పం లాంటి 17 వెబ్‌ సైట్స్ ద్వారా కోట్లు సంపాదించిన ఇమ్మడి రవి అలియాస్ ఐబొమ్మ రవికి కోర్టు షాక్ ఇచ్చింది. ప్రస్తుతం రవి పోలీస్ కస్టడీలో ఉన్నాడు. ఈ మధ్య ఆయన బెయిల్ కోసం పెట్టుకున్న అర్జీని కోర్టు తిరస్కరించింది. కాగా, ఈ పిటీషన్ పై నాంపల్లి కోర్టులో మంగళవారం మరోసారి విచారణ జరిగింది.

12 రోజుల పోలీస్ కస్టడీ

ఈ నేపథ్యంలో రవిని 12 రోజుల పాటు పోలీస్ కస్టడీకి తీసుకునేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. ఒక్కో కేసులో 3 రోజుల పాటు విచారించాలని తెలిపింది. ఐబొమ్మ రవిపై నాలుగు కేసులు ఉండగా.. మొత్తం 12 రోజుల పాటు విచారించనున్నట్లు తెలుస్తుంది. ఈ నెల 18 నుంచి విచారణ మొదలుకానుంది. ఈ కస్టడీ ద్వారా పోలీసులు ఐబొమ్మ రవికి సంబంధించిన వెబ్‌సైట్ కార్యాకలాపాలను పూర్తిగా ఛేదించి, పైరసీ నెట్‌వర్క్ ని పూర్తిగా క్లోజ్ చేసే పనిలో ఉన్నారు.

రవి తరుపున లాయర్ శ్రీనాథ్ వాదనలు

తాజాగా నాంపల్లి కోర్టులో కొనసాగిన విచారణలో రవి తరుపు లాయర్ శ్రీనాథ్ తమ వాదనలు వినిపించారు. రవిని రెండు సార్లు కస్టడీకి తీసుకున్నారని.. అతడిని ఇబ్బందులు పెడుతున్నారని కోర్టుకు తెలిపారు. మరోవైపు అతనికి బెయిల్  మంజూరు చేస్తే కేసును పక్కదారి పట్టించే అవకాశం ఉందని సైబర్ క్రైమ్ పోలీసులు వివరించారు. చిత్ర పరిశ్రమకు తీవ్ర నష్టం కలిగిస్తున్నాడని.. ఐబొమ్మ రవిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు నవంబర్ 14 అరెస్ట్ చేశారు.

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్‌, వెలుగు దినపత్రిక, V6 చానెల్ లో జర్నలిస్టుగా పని చేశాను.2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశాను. BIG TVకి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, ఆటో, క్రైమ్ వార్తలు అందించాను.ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments