మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి హైకోర్టులో ఉపశమనం లభించింది. ఐదేళ్ల కాలపరిమితితో ఆయనకు పాస్‌పోర్టు ఇవ్వాలని కోర్టు పాస్‌పోర్టు అధికారులను ఆదేశించింది. ఆయన తాజాగా పాస్‌పోర్టు పొందేందుకు అవసరమైన నిరభ్యంతర పత్రాన్ని(ఎన్‌వోసీ) జారీ చేసింది. యూకేలో ఈ నెల 16న జరగనున్న కుమార్తె స్నాతకోత్సవ కార్యక్రమానికి హాజరయ్యేందుకు అనుమతి ఇచ్చింది.
గుండెపోటుతో 8 ఏళ్ల బాలిక మృతి!…
పాస్‌పోర్టు జారీ విషయంలో స్పష్టమైన ఉత్తర్వులు ఉన్నాయని, తమముందు హాజరై రూ.20వేల స్వీయ పూచీకత్తు సమర్పించాల్సిందేనంటూ.. ఎన్‌వోసీ కోసం జగన్ వేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ విజయవాడ ప్రత్యేక కోర్టు (ఎంపీ, ఎమ్మెల్యేల కేసులను విచారించే న్యాయస్థానం) ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కె.శ్రీనివాసరెడ్డి మంగళవారం తీర్పు వెలువరించారు.
ఘోరంగా కొట్టుకున్న బిజెపి మరియు కాంగ్రెస్ నాయకులు
కాగా 2024లో జరిగినటువంటి ఎన్నికలలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేవలం 11 సీట్లతో ఘోరంగా ఓడిపోయారు. మొదటగా 175 175 గెలిచి చూపిస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి అతి ఘోరంగా కేవలం 11 సీట్స్ మాత్రమే గెలిచి ఎలక్షన్లలో ఓడిపోయిన విషయం మనందరికీ తెలిసిందే. ఇక అప్పటినుండి జగన్మోహన్ రెడ్డి అప్పుడప్పుడు విదేశాలకు వెళుతూ తన కూతుర్లను కలుస్తూ మళ్లీ స్వదేశానికి వస్తూ ఉన్నాడు. కాగా తాజాగా యూకే లో ఈనెల 16వ తారీఖున జరగబోయే తన కూతురు స్నాతకోత్సవ కార్యక్రమానికి జగన్ లండన్ వెళ్లడానికి పర్మిషన్ ఇచ్చింది.
Read also
1. కేటీఆర్ పిటిషన్ డిస్మిస్.. ఎల్లుండి అరెస్ట్!
2. ఏపీ ప్రజలకు శుభవార్త!… తగ్గనున్న విద్యుత్ చార్జీలు?
3. భారీగా పెరుగుతున్న చైనా వైరస్ కేసులు.. గాంధీ హాస్పిటల్ రెడీ