జాతీయం

వీధి కుక్కల తరలింపు వివాదం.. భగ్గు మంటున్న పెట్ లవర్స్!

క్రైమ్ మిర్రర్, ఢిల్లీ :- వీధి కుక్కల తరలింపు పై ఢిల్లీలో పెద్ద వివాదమే ముదురుతోంది. కొద్ది రోజులుగా సోషల్ యాక్టివిస్ట్స్, పెట్ లవర్స్ మాత్రమే కాకుండా సినిమా తారలు కూడా తీవ్రంగా మండిపడుతున్నారు. వీధి కుక్కలపై కోర్టు ఏకపక్షంగా తీర్పు ఇచ్చింది అని.. అసలు ఇదేం న్యాయమని ఫైర్ అవుతున్నారు. ఢిల్లీలో ప్రతిరోజు కూడా ఎన్నో మానభంగాలు జరుగుతున్న… రేపిస్టులను వదిలేసి మూగ జీవులను జైల్లో వేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. కోర్టు ఇచ్చిన తీర్పు చాలా అన్యాయం అంటూ పెట్ లవర్స్ రోడ్డుపై ఆవేదనలు వ్యక్తం చేస్తున్నారు. కాగా ఢిల్లీలో చాలా రోజుల నుంచి వీధి కుక్కలు బెడత ఎక్కువ అయిందని… ఈ వీధి కుక్కల దాడుల్లో చాలామంది చిన్నారులు బలయ్యారని చాలామంది కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై కోర్టు వీధి కుక్కలను వెంటనే బంధించి వాటికి సంబంధించినటువంటి షెల్టర్ గృహాల్లో ఉంచాలని తీర్పు ఇచ్చింది.

Read also : ధైర్యానికి జాతీయ గౌరవం: కానిస్టేబుల్ రాజునాయక్‌కు శౌర్య పథకం

అయితే వీటిపై చాలామంది ఇదెక్కడి న్యాయమని మండిపడుతూ ఉండగా… వీళ్ళపై సామాన్యులు మరో రూపంలో మండిపడుతున్నారు. కుక్కల దాడుల్లో ఎంతోమంది చిన్నారులు ఘటనలు మీరు చూడలేదా… కుక్కలు ఇష్టమైతే ఇంట్లో పెంచుకుంటున్నారు కదా!… వీధి కుక్కలను షెల్టర్లకు తరలిస్తే మీకేం ప్రాబ్లం అని ప్రశ్నిస్తున్నారు. వీధి కుక్కలపై ప్రేమ ఉండొచ్చు కానీ… మరి చిన్నారులు బలుతున్న ఘటనలు చూసి కూడా ఇలా మాట్లాడితే ఎలా అని సామాన్య ప్రజలు.. జంతు ప్రేమికులను, సోషల్ యాక్టివిస్టస్ ను ప్రశ్నిస్తున్నారు. కాగా ఈ మధ్య హీరోయిన్ సదా కూడా వీధి కుక్కలను అలా బంధించడం లాంటివి చేయకండి అని సోషల్ మీడియా వేదికగా ఏడుస్తూ వీడియో అప్లోడ్ చేశారు. కోర్టు ఇచ్చిన తీర్పు నన్ను లో లోపల చంపేస్తుంది అని ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టు తీర్పును వెనక్కి తీసుకోండి అని అన్నారు. వీధి కుక్కలను కాపాడేందుకు.. మద్దతుగా నిలిచేందుకు గళం విప్పాలని ప్రజలను కోరారు.

Read also : లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిరుపేద విద్యార్థులకు ఉచిత సైకిళ్ల పంపిణీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button