- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
- ప్రజల విశ్వాసం గులాబీ జెండాపైనే
- నడిగడ్డ స్ఫూర్తి రాష్ట్రానికి కావాలి
- మళ్లీ కేసీఆర్ నాయకత్వంలో గులాబీ జెండా ఎగురుతుంది
- బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిమెంట్ కేటీఆర్
హైదరాబాద్,క్రైమ్ మిర్రర్: అవినీతి, అరాచకము రెండు కలిస్తేనే కాంగ్రెస్ ప్రభుత్వమని బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అసమర్థ నాయకత్వం, చేతకాని ప్రభుత్వంలో తెలంగాణ ప్రజలు అరిగోసపడుతున్నారని మండిపడ్డారు.
సీఎం రేవంత్ రెడ్డి గారడి మాటలతో తెలంగాణ రైతులకు రైతు ఇవ్వకుండా మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఈ సందర్భంగా అలంపూర్ నియోజకవర్గంలో విజయం సాధించిన కౌన్సిలర్లను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయనమాట్లాడారు.
ఆలంపూర్, ఐజ, గద్వాల, వడ్డేపల్లి ప్రాంతాల్లో బీఆర్ఎస్కు ప్రజలు అందించిన మద్దతు విశేషమని తెలిపారు.రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ నడిగడ్డలో మాత్రం ప్రజల విశ్వాసం ఇప్పటికీ బీఆర్ఎస్పైనే ఉందని పేర్కొన్నారు.
సర్పంచ్ ఎన్నికల నుంచి మున్సిపల్ ఎన్నికల వరకు మెజారిటీ స్థానాలు గెలుచుకోవడం పార్టీ బలాన్ని నిరూపిస్తోందన్నారు.నాగర్కర్నూల్లో రెండు నెలల పాప మరణ ఘటన, కోదాడలో దళిత యువకుడు కర్ల రాజేష్ లాకప్ డెత్ వంటి ఘటనలు ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు.
ఖమ్మం వెలుగుమట్లలో ఇళ్ల కూల్చివేతలు ప్రజలను రోడ్డున పడేసిన దారుణ చర్యలని ఆక్షేపించారు.రాష్ట్రంలో అవినీతి, అరాచకం జోడెడ్లుగా మారాయని ఆయన విమర్శించారు. నడిగడ్డ స్ఫూర్తి రాష్ట్రం మొత్తం వ్యాపించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.
ఎమ్మెల్సీ చల్ల వెంకట్రామి రెడ్డి ప్రజల సమస్యలపై అంకితభావంతో పనిచేసే నాయకుడని, ఎమ్మెల్యే విజయుడు కూడా అదే తత్వాన్ని కొనసాగిస్తున్నారని ప్రశంసించారు.మరోసారి కేసీఆర్ నాయకత్వంలో గులాబీ జెండా ఎగరడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామి రెడ్డి, ఎమ్మెల్యే విజయుడు తదితర ముఖ్య నేతలు పాల్గొన్నారు.
