క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :-
తెలంగాణ రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబడులు రాబట్టేందుకు దావోస్ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి అంచనాలకు మించి భారీ స్థాయిలో పెట్టుబడులు సాధించి తిరిగి వచ్చారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో దిగిన ఆయనకు పార్టీ శ్రేణులు భారీ ఎత్తున వెల్కమ్ చెప్పాయి. ఈ వీడియో అలా ట్రెండ్ అవుతున్న సమయంలోనే… అదే పార్టీకి చెందిన మరో వీడియో ఎంట్రీ ఇచ్చి రేవంత్ వెల్కమ్ వీడియో ను బీట్ చేస్తూ వైరల్ అయిపోయింది.
త్వరలోనే మౌని అమావాస్య!… మహా కుంభమేళకు భారీగా రానున్న జనాలు?
ఈ వైరల్ వీడియోలో ఏముందన్న విషయానికి వెళితే…కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి… కరీంనగర్ జిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న మహిళా ఐఏఎస్ అధికారిణి పమేలా సత్పతిపై చిందులు తొక్కుతూ కనిపించారు. అదేదో క్లోజ్డ్ డోర్ లలో జరిగిన ఘటన కాదు. అందరూ చూస్తుండగానే అందరి మధ్యలోనే మహిళా అధికారి… అందులోనూ ఐఏఎస్ అధికారిణి అని కూడా చూడకుండా… బుద్ధుందా? అంటూ ఆమెపై పొంగులేటి నిజంగానే చిందులు తొక్కుతూ ఊగిపోయారు.
బ్యాంకు అధికారిని ముంచిన స్కామార్లు!… ఏకంగా 78 లక్షల టోకర?
ఈ ఘటన కరీంనగర్ లో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. నగరంలో పలు అభివృద్ది పనులను ప్రారంభించేందుకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ పర్యటించారు. స్థానిక ఎంపీ హోదాలో మరో కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రులు పొన్నం ప్రభాకర్ తో పాటు పొంగులేటి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కార్యక్రమం ముగిసిన తర్వాత ఇద్దరు కేంద్ర మంత్రుల సమక్షంలోనే పొంగులేటి కలెక్టర్ పై విరుచుకుపడిపోయారు.