Monday, March 16, 2026
Homeతెలంగాణఎమ్మెల్యే పై కోడిగుడ్లు విసిరిన కార్యకర్తలు!.. కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ?

ఎమ్మెల్యే పై కోడిగుడ్లు విసిరిన కార్యకర్తలు!.. కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ?

క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :-

తెలంగాణ రాష్ట్రంలోని హనుమకొండ జిల్లాలోని కమలాపూర్ గ్రామసభలో రాజకీయ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ మరియు టిఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చలరేగడంతో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. తాజాగా ఇందిరమ్మ ఇళ్ల జాబితా పై అధికారులను ప్రశ్నిస్తున్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏమీ చేయలేదని విమర్శించారు. ఈ మాటలు విన్న కాంగ్రెస్ శ్రేణులు టమాటాలు మరియు కోడిగుడ్లను ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై విసిరారు. అయితే ఆ కోడిగుడ్లనేవి అక్కడున్నటువంటి అధికారికి తగలడంతో ఉద్రిక్తత పరిస్థితులు అక్కడ ఏర్పడ్డాయి. అయితే అదే సమయంలో బి ఆర్ ఎస్ నాయకులు కూడా కాంగ్రెస్ నాయకులు పై కుర్చీలు విసరడంతో పెద్ద వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అక్కడ నుంచి వెళ్లిపోయారు. దీంతో అక్కడి పరిస్థితులు కొంచెం సద్దుమణిగాయి.

మరిన్ని చదవండి

1.డౌట్ తో కంటైనర్ ను తెరవమన్న పోలీసులు!.. లోపల ఉన్నది చూస్తే షాక్ అవ్వాల్సిందే

2.మంత్రి పదవి కోసం ఇల్లు మార్చిన రాజగోపాల్ రెడ్డి!

3.2025 ఆస్కార్‌ నామినేషన్స్‌!… పోటీలో ఉన్న చిత్రాలివే?

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది.పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments