కక్ష సాధింపు రాజకీయాలు ఏ పార్టీకీ మంచిది కాదని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజల రక్తంలో కక్ష సాధింపు గుణం ఉండదని తాజాగా మీడియా ద్వారా చెప్పారు. కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడిన వాళ్లు అధికారం కోల్పోయాక బాధపడాల్సి వస్తుందని అభిప్రాయ పడ్డారు. ఉమ్మడి రాష్ట్రానికి సీఎంలుగా చేసిన చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి కక్ష సాధింపు రాజకీయాలు చేయలేదని చెప్పారు. మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా ఆయన ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను కక్ష సాధింపు రాజకీయాలకు వ్యతిరేకమని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. తనకు ఎవరైనా నష్టం చేస్తే.. తిరిగి వారికి నష్టం చేసే గుణం తనకు లేదన్నారు. కానీ వారితో రాజకీయంగా యుద్ధం మాత్రం చేస్తానని పేర్కొన్నారు. యుద్ధం వేరు.. కక్ష సాధింపు వేరని ఆయన చెప్పారు. అధికారం అనేది ఏ రాజకీయ పార్టీకీ శాశ్వతం కాదని వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రతీకార రాజకీయాలు చేస్తే ఆ తర్వాత పశ్చాత్తాపం పడాల్సి ఉంటుందున్నారు. రాజకీయ పోరాటం వేరు.. పాలన వేరని అభిప్రాయపడ్డారు. దేనికోసం పోరాటం చేసి అధికారంలోకి వచ్చామో దానిని అమలు చేయాలని సూచించారు. తనతో సహా ఏ పార్టీకి చెందిన నాయకుడైనా.. పైసలు ముట్టుకోకుండా రాజకీయం చేయగలుగుతాడని ఎవరైనా చెప్పగలరా అని జగ్గారెడ్డి ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి
1.13 ఏళ్ల తర్వాత రంజీ ట్రోఫీలో అడుగుపెడుతున్న కోహ్లీ!..
2.కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు!.. ఎగిసి పడ్డ భారీ మంటలు?
3.మీ రాష్ట్రానికి అండగా నరేంద్ర మోడీ ఉన్నారు : అమిత్ షా
4.పర్యాటకులకు కనువిందు చేస్తున్న తెలంగాణ నయాగరా బోగత జలపాతం..