తెలంగాణ

బీసీ రిజర్వేషన్లపై ప్రజలను కాంగ్రెస్ మోసం చేస్తోంది: కిషన్‌రెడ్డి

  • బీసీలకు 32శాతం రిజర్వేషన్లు అమలు చేసేలా కుట్రలు

  • ముస్లింల కోటాను 4 శాతం నుంచి 10 శాతానికి పెంచారు

  • బీసీ కోటాపై ప్రజలను మభ్యపెడుతున్నారు-కిషన్‌రెడ్డి

  • సర్వేల పేరుతో బీసీలను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు

  • బీసీ కోటాలో ముస్లింలు పోటీచేసే అవకాశం ఉంది

  • ఒవైసీకి మేలు చేకూర్చేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నం: కిషన్‌రెడ్డి

క్రైమ్‌మిర్రర్‌, హైదరాబాద్‌: బీసీ రిజర్వేషన్ల విషయంలో ప్రజలను కాంగ్రెస్‌ మోసం చేసేందుకు ప్రయత్నిస్తోందని, బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఆశచూపి 32శాతమే అమలు చేసేలా కుట్రలు చేస్తోందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. బీసీ కోటా విషయంలో ప్రజలను కాంగ్రెస్‌ మభ్యపెట్టాలని చూస్తోందని, ముస్లింల కోటాను 4శాతం నుంచి 10శాతానికి పెంచడం పట్ల కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

సర్వేల పేరుతో బీసీలను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో హైదరాబాద్‌లో 150 డివిజన్లలో బీసీలకు 50 డివిజన్లు ఇచ్చారని, ఇప్పుడు బీసీ కోటాలోని సీట్లన్నీ ముస్లింలకు కేటాయించే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. ఒవైసీకి మేలు చేయడమే ధ్యేయంగా కాంగ్రెస్‌ ప్రయత్నాలున్నాయని, దీనిపై రేవంత్‌ సర్కార్‌ సమాధానం చెప్పాలన్నారు కిషన్‌ రెడ్డి.

Read Also: 

  1. హస్తినలో సీఎం రేవంత్ ఫుల్ బిజీ, కేబినెట్ భేటీ వాయిదా
  2. మొరాయించిన మూసీ గేట్లు.. ఒకదానికి పూజ.. మరొకటి ఓపెన్!
Back to top button