
క్రైమ్ మిర్రర్, మహాదేవ్ పూర్ ప్రతినిధి:-
తెలంగాణకు జలభాండాగారమైన కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పన్నిన కుట్రలను పటాపంచలు చేసి ప్రజలకు అసలు వాస్తవాలను వివరించడానికి కాళేశ్వరం గోదావరినది ఒడ్డున సోమవారం రోజు ఉదయం 11 గంటలకు చర్చా కార్యక్రమం ఏర్పాటు చేయనున్నట్లు మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ తెలిపారు. ఈ కార్యక్రమానికి మండలి బీఆర్‌ఎస్ ఫ్లోర్ లీడర్ మధుసూధనాచారి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ ఎల్.రమణ, మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, నడిపెల్లి దివాకర్‌రావు, దుర్గం చిన్నయ్య, కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, దాసరి మనోహర్‌రెడ్డి, కోరుకంటి చందర్, గండ్ర వెంకటరమణారెడ్డి, మాజీ జడ్పీచైర్పర్సన్లు జక్కు శ్రీహర్షిణి, దావ వసంతలతో పాటు సాగనీటి నిపుణుడు వీరమల్ల ప్రకాష్ తదితరులు పాల్గొని కాళేశ్వరం ప్రాజెక్టుపై జరుగుతున్న కుట్రల గురించి కూలంకషంగా చర్చించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి మంథని నియోజకవర్గానికి చెందిన ప్రజలు, మేధావులు, తెలంగాణ వాదులు హాజరై కాళేశ్వరంపై కాంగ్రెస్ చేస్తున్న కుట్రలను పటాపంచలు చేసి ప్రజల్లోకి వాస్తవ విషయాలను తీసుకెళ్లాలని కోరారు.
టియూడబ్ల్యూజే రంగారెడ్డి జిల్లా సంయుక్త కార్యదర్శిగా ఆంజనేయులు