
-
బీజేపీ ఎంపీలకు దమ్ముంటే పార్లమెంట్‌లో మాట్లాడాలి
-
రోడ్లపైకి వచ్చి డ్రామాలు చేస్తే ప్రజలు సహించరు: కేటీఆర్
-
బీఆర్‌ఎస్‌లోకి పాశం యాదగిరి కూతురు, అల్లుడు
-
కేటీఆర్ సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకున్న నేతలు
-
ప్రకాశ్ గౌడ్ ఎవరి అభివృద్ధికోసం పార్టీ మారాడో చెప్పాలి
-
మేం అధికారంలోకి రాగానే అన్నీ బయటకు తీస్తాం: కేటీఆర్
క్రైమ్‌మిర్రర్, హైదరాబాద్: కాంగ్రెస్ సర్కార్‌లో గీతక్క, సీతక్క, సురేఖ అక్క సంతోషంగా ఉన్నారని అనుకునేవారని, ఇప్పుడు సురేఖ అక్క కూడా సంతోషంగా లేరని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. కేటీఆర్ సమక్షంలో సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి కూతురు పల్లవి, అల్లుడు అంజిబాబు భారత రాష్ట్ర సమితి పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత దీపావళి సమయంలో పొంగులేటి బాంబులు పేలబోతున్నాయని అన్నారని, కానీ ఇప్పుడు వారింట్లోనే బాంబులు పేలాయని చురకలంటించారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ జాతకం అందరికీ తెలిసిందేనని, ఎవరి అభివృద్ధి కోసం పార్టీ మారారో చెప్పాలన్నారు కేటీఆర్. తాము అధికారంలోకి రాగానే అన్నీ బయటకు తీస్తామని కేటీఆర్ హెచ్చరించారు.
కాంగ్రెస్, బీజేపీ ప్రజలను మోసం చేస్తున్నాయి
బీసీ రిజర్వేషన్ల విషయంలో ప్రజలను కాంగ్రెస్, బీజేపీ మోసం చేస్తున్నాయన్నారు కేటీఆర్. బీసీ బంద్ అంటే తాము మద్దతిచ్చామని, అయితే కాంగ్రెస్, బీజేపీ కూడా ధర్నాలో పాల్గొనడం విడ్డూరంగా ఉందన్నారు. అధికారం చేతిలో ఉన్న బీజేపీ తలుచుకుంటే రిజర్వేషన్ బిల్లును చట్టబద్ధం చేయడం క్షణాల్లో జరిగిపోతుందన్నారు. పార్లమెంట్‌లో మాట్లాడకుండా… రోడ్లపైకి వచ్చి డ్రామాలు చేయడం బీసీలను మోసం చేయడమేనని కేటీఆర్ దుయ్యబట్టారు.
ఇవీ చదవండి