Wednesday, February 18, 2026
Homeతెలంగాణకేసీఅర్ కార్యాలయాన్ని ముట్టడించిన కాంగ్రెస్

కేసీఅర్ కార్యాలయాన్ని ముట్టడించిన కాంగ్రెస్

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు షాకుల మీక షాకులు ఇస్తోంది కాంగ్రెస్. సొంత జిల్లాలోనే కేసీఆర్ కు చుక్కలు చూపిస్తున్నారు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు. గులాబీ బాస్ కోటగా చెప్పుకునే మాజీ మంత్రి హరీష్ రావు నియోజకవర్గం సిద్దిపేటలోనే తొడకొట్టి సవాల్ చేశారు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు. వేలాది మందితో కేసీఆర్ కు వ్యతిరేకంగా ర్యాలీ తీశారు. కేసీఆర్, హరీష్ రావు భరతం పడతానని సిద్దిపేట చౌరస్తా సాక్షిగా మైనంపల్లి సవాల్ చేశారు.

Read More : చంద్రబాబుతో ముగ్గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల భేటి!

తాజాగా కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్ లో కాంగ్రెస్ నేతలు ఆయన ఝలక్ ఇచ్చారు. గజ్వేల్ లో మాజీ ముఖ్యమంత్రి కేసీఅర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించారు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు.కల్యాణ లక్ష్మి , శాది ముబారక్, సీఎం అర్ ఎఫ్ చెక్కులు పంపిణీ చేయాలని కేసీఅర్ చిత్రపటానికి వినతి పత్రం అందజేశారు. కేసీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి కాంగ్రెస్ కార్యకర్తలను అడ్డుకున్నారు. కేసీఆర్ ఐదు నెలలుగా కనిపించడం లేదని.. ఆయన రాకపోవడంతో కల్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులు రావడం లేదని కాంగ్రెస్ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments