
క్రైమ్ మిర్రర్, సినిమా న్యూస్:- గత కొద్ది రోజులుగా టాలీవుడ్ నటులు శివాజీ, యాంకర్ అనసూయ ఇద్దరి మధ్య డ్రెస్సింగ్ విషయంలో గొడవలు జరుగుతున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. నటుడు శివాజీ తను నటించిన దండోరా సినిమా మూవీ ప్రమోషన్ లో భాగంగా అమ్మాయిలు కాస్త మంచి బట్టలు ధరించండి అని అందులో కొన్ని చెడు వ్యాఖ్యలు కూడా మాట్లాడిన విషయం తెలిసిందే. అయితే శివాజీ మాటలకు అనసూయ స్పందిస్తూ నా బాడీ నా ఇష్టం అంటూ ఆమె తీవ్రంగా ఫైర్ అయ్యారు. వీరిద్దరీ మధ్య గొడవలో చాలామంది శివాజీకి సపోర్ట్ చేస్తుండగా మరి కొంతమంది అనసూయకు సపోర్ట్ చేస్తున్నారు. అమ్మాయిలు మంచి బట్టలు ధరించండి అని శివాజీ చెప్పిన దాంట్లో తప్పేముందని కొంతమంది తనకు సపోర్ట్ చేస్తూ ఉండగా మరి కొందరు మాత్రం ఎవరిష్టం వారిదే అంటూ అమ్మాయిలకు మీరు చెప్పాల్సిన అవసరం లేదు అంటూ అనసూయకు సపోర్ట్ చేస్తున్నారు.
Read also : Rare Condom: రూ.44 వేలకు వేలంలో అమ్ముడుపోయిన 200 ఏళ్ల నాటి కండోమ్
అయితే తాజాగా వీరిద్దరి మధ్య గొడవలోకి ప్రకాష్ రాజ్ ఇంటర్ ఇచ్చారు. ప్రకాష్ రాజ్ ఏకంగా అనసూయకి సపోర్ట్ గా నిలిచారు. సంస్కారులమని చెప్పుకునే వారిని మొరగనివ్వు అని.. అది వాళ్ళ కుంచిత మనస్తత్వం.. మేమంతా మీతోనే ఉన్నామంటూ అనసూయకు సపోర్ట్ గా ట్వీట్ చేశారు. మరోవైపు ఎమ్మెల్సీ నాగబాబు సైతం శివాజీ వ్యాఖ్యలను ఖండిస్తూ అనసూయకు మద్దతుగా నిలిచారు. దీంతో అనసూయ వెంటనే మా బాబు గారు ఎప్పుడు మా వైపే ఉంటారు అంటూ థాంక్స్ చెప్పడం కూడా చకచకా అయిపోయాయి. దీంతో ఈ విషయం ఇంతటితో సద్దుమణిగేలా కనిపించడం లేదు.
Read also : Top 5 credit cards: బెనిఫిట్స్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!





