
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే ఎన్నికల ముందు ఎలక్షన్ క్యాంపియన్ లో భాగంగా చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ హామీలను ప్రకటించిన విషయము కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే 2024 ఎన్నికలలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే పనిలో నిమగ్నమై ఉంది. అయితే ఈ సూపర్ సిక్స్ అమలులో భాగంగా తాజాగా తల్లికి వందనం పథకంలో భాగంగానే ఒక కుటుంబంలో చదువుకునే పిల్లోడికి 15వేల రూపాయలు చొప్పున డబ్బులను ఎకౌంట్లో వేయడం జరిగింది.
ఇక తాజాగా మరో పథకాన్ని అమలు చేసే దిశగా సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగస్టు 15 నుంచి మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. మహిళలకు’ జీరో ఫెర్ టికెట్ ‘ ఇవ్వాలని ఈ ముఖ్యమంత్రి సూచించారు. అలాగే ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేస్తున్నారనేది కూడా తెలుసుకోవాలని కోరారు. ఉచిత ప్రయాణంతో ఒక్కొక్కరికి ఎంత డబ్బులు ఆదా అవుతున్నాయి అనేవి కూడా తెలుసుకోవాలని ముఖ్యమంత్రి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇకనుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏసీ ఎలక్ట్రిక్ బస్సులను మాత్రమే కొనుగోలు చేయాలని అధికారులతో తాజాగా జరిపిన సమీక్షలో ఆదేశించారు.
కాంగ్రెస్ కార్యాలయాల్లా పోలీస్‌స్టేషన్లు!… ఆర్మూర్ పీఎస్‌లో హస్తం పార్టీ నేతల ప్రెస్‌మీట్
తీవ్ర అస్వస్థతకు గురైన తమిళనాడు ముఖ్యమంత్రి!.. హెల్త్ పై కీలక అప్డేట్?