
క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- ఐ బొమ్మ రవి అరెస్ట్ అయిన దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా పైరసీ సినిమాలను చూడడం మానేశారు. ఐ బొమ్మ అలాగే కొన్ని సినిమాలను పైరసీ చేసే వెబ్సైట్లను పోలీసులు కనుగొన్నారు. ఇందులో భాగంగానే మొదటగా ఐ బొమ్మ నిర్వాహకుడు రవిని పోలీసులు అరెస్ట్ చేసి అతని నుంచి ఎన్నో వివరాలను విచారణ రూపంలో రాబడుతున్నారు. ప్రస్తుతం ఐ బొమ్మ వెబ్సైట్ క్లోజ్ కాగా… మరి కొద్ది రోజుల్లో మిగతా అన్ని వెబ్సైట్లు కూడా క్లోజ్ అయ్యేలా చూస్తామని ఇప్పటికీ పోలీసులు తెలిపారు. ఈ సందర్భంలోనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినిమాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. సినిమాల పైరసీ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది అని తెలిపారు. ఇదే సమయంలో ఇలాంటి పైరసీలు మరోసారి జరగకుండా వీటిపై ఉక్కు పాదం మోపేందుకు ఒక ప్రత్యేకమైన వింగ్ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నట్లుగా మీడియా వర్గాలు వెల్లడించాయి. కేవలం పైరసీనే కాకుండా ఇతర సైబర్ నేరాలు కట్టడికి కూడా ఇదే విధంగా చర్యలు తీసుకోవాలని సీఎం ఇప్పటికే పోలీస్ శాఖకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లుగా వివరించాయి. దమ్ముంటే పట్టుకోమని చెప్పినటువంటి ఐ బొమ్మ నిర్వాహకుడు రవిని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఇలానే సైబర్ నేరగాళ్లను కూడా పట్టుకుని ఇదేవిధంగా వారికి పోలీసులు అంటే ఏంటో తెలియజేసేలా చూడాలని సామాన్యులు కోరుతున్నారు.
Read also : Realme: 7000mAh బ్యాటరీతో క్రేజీ ఫోన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..
Read also : Egg Prices: రికార్డులు బద్దలుకొట్టిన కోడిగుడ్డు ధరలు





